'RRR' వంటి సంచలన మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ మరింత హైట్స్ కి చేరింది. దేశ వ్యాప్తంగా ఈ మూవీ తనకు మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టడమే కాకుండా ఎన్టీఆర్ ని మరింతగా పాపులర్ అయ్యేలా చేసింది. దీంతో ఈ మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ ప్రాజెక్ట్ ని చేయబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పడు దేశ వ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టి ఈ ప్రాజెక్ట్ పైనే వుంది. ఇదిలా వుంటే గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? .. ఎప్పుడు లాంఛనంగా పూజా కార్యక్రామాలు పూర్తి చేసుకుని సెట్స్ పైకి వస్తుందా? అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్న సినిమాల నుంచి భారీ చిత్రాల వరకు లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నా 'NTR30 మాత్రం ముందుకు కదలడం లేదు.
దీంతో 'NTR30 వెనక ఏం జరుగుతోంది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ వున్నట్టా.. లేనట్టా అనే అనుమానాలు కూడా అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి మరింత సమయం పట్టే అవకాశం వుందని తెలుస్తోంది.
దానికి ప్రధాన కారణం దర్శకుడు కొరటాల శివ తీసుకున్న సంచలన నిర్ణయమేనని చెబుతున్నారు. ముహూర్తాలు లేకపోవడంతో శ్రీవిష్ణు నుంచి బన్నీ వరకు తమ సినిమాల ఓపెనింగ్ సెర్మనీలని జరిపించేశారు.
కానీ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న 'NTR30 కి సంబంధించిన పూజా కార్యక్రమాలు మాత్రం జరగలేదు. కారణం ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి కాకపోవడమేనని తెలిసింది. 60 శాతం స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేయాలని దర్శకుడు కొరటాల సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆ మార్పుల కారణంగానే ఈ మూవీ సెట్స్ పైకి రావడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం వుందని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ కు ఊహించని భారీ డిజాస్టర్ ఎదురైతే ఎలాంటి ఒత్తిడికి గురవుతారో కొరటాల శివని చూస్తే స్పష్టమౌతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
రీసెంట్ గా కొరటాల శివ 'ఆచార్య'తో ఊహించని విధంగా భారీ డిజాస్టర్ ని సొంతం చేసుకున్నారు. ఆ పరాజయ భారం నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు. దాని ఇంపాక్ట్ 'NTR30 పై పడటంతో ఈ మూవీ స్క్రిప్ట్ లో కొరటాల ప్రస్తుతం భారీ మార్పులకు శ్రీకారం చుట్టారట. ఆ కారణంగానే ఈ మూవీ అనుకున్న సమయానికి సెట్స్ పైకి వెళ్లలేక పోతోందని, త్వరలోనే పూర్తి స్థాయిలో సెట్స్ పైకి వెళుతుందని ఇన్ సైడ్ టాక్