చరణ్ పుట్టినరోజున స్టార్ డైరెక్టర్ స్పెషల్ సర్ప్రైజ్..!

Update: 2021-03-12 13:30 GMT
మెగాపవర్ స్టార్ రాంచరణ్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎప్పుడైతే అధికారిక ప్రకటన బయటికి వచ్చిందో.. అప్పటినుండి ఈ కాంబో పై అంచనాలు భారీ రేంజిలో నెలకొన్నాయి. నిజానికి డైరెక్టర్ శంకర్ సినిమా అంటేనే బడ్జెట్ విషయంలో రాజీపడకుండా ఉండాల్సి వస్తుంది. ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఆయనకు ఇది 50వ సినిమా కావడం విశేషం. అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే డైరెక్టర్ శంకర్ తో సుధీర్ఘ చర్చలు జరిపిన తర్వాత చివరిగా సినిమా బడ్జెట్ విషయం ఓ కొలిక్కి వచ్చిందని టాక్. అయితే ఈ సినిమా రాంచరణ్ కెరీర్లో 15వ సినిమాగా  రూపొందనుంది. ప్రస్తుతం రాంచరణ్ ఆర్ఆర్ఆర్ కంప్లీట్ చేసేపనిలో ఉన్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. రాంచరణ్ కోసం డైరెక్టర్ శంకర్ భారీ ప్లాన్ వేసాడట. మార్చ్ 27న రాంచరణ్ పుట్టినరోజు ఉండటంతో ఈ సందర్బంగా తమ సినిమాకు సంబంధించి ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయాలనీ ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమా జులైలో సెట్స్ పైకి వెళ్లనుందట. అలాగే వచ్చే ఏడాది అంటే 2022 జులైలో సినిమా రిలీజ్ అవుతుందని సినీవర్గాలు చెబుతున్నాయి. పొలిటికల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమాను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు శంకర్. ఎందుకంటే శంకర్ స్టామినా, పనితనం ఏంటో దేశవ్యాప్తంగా సినీప్రేక్షకులకు తెలిసిందే. ఆయన ప్రతి సినిమాలో ఏదొక సందేశం ఉండేలా చూసుకుంటారు. అలాగే ఈ సినిమాకోసం బాలీవుడ్ నటులను కూడా లైన్ పెడుతున్నారట మేకర్స్. చూడాలి మరి రాంచరణ్ పుట్టినరోజున నిజంగా సర్ప్రైజ్ ఉంటుందేమో!
Tags:    

Similar News