టాలీవుడ్ సినీచరిత్రలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు. సినిమా రంగంలో ఎన్నో యేళ్ల నుండి దర్శకుడిగా సేవలందిస్తూ ఎన్నో గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించారు. తెలుగు ఇండస్ట్రీలో ఆయనతో సినిమా చేయని హీరో లేడు.. ఆడిపాడని హీరోయిన్ లేదు. దర్శకేంద్రుడి సినిమా అంటే ప్రేక్షకులలో ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి. కానీ దర్శకేంద్రుడు సినిమాలలో అందరికి కావాల్సినవి సమపాళ్లలో అందిస్తారు. ఉగాది పచ్చడిలా తీపి చేదు కారం.. అలా ఫ్రూట్స్ తో సహా. అయితే గత కొంతకాలంగా దర్శకేంద్రుడు దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. కెరీర్ లో దర్శకుడిగా 100 సినిమాల రికార్డు బ్రేక్ చేశారు. రాఘవేంద్రరావు చివరిగా అక్కినేని నాగార్జున హీరోగా 2017లో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మళ్లీ ఆయన నుండి ఏ కబురు లేదు. అలా
మూడేళ్లకు పైగా దర్శకత్వానికి దూరంగా ఉండటం ఆయన కెరీర్లోనే మొదటిసారి. ఇక ఎప్పటినుండో ఎదురుచూస్తున్న రాఘవేంద్రరావు కొత్త సినిమా కబురు ఆయనే ప్రకటించారు. కానీ ఆయన దర్శకుడిగా కాదు. రాఘవేంద్రరావు హీరోగా ఒక కొత్త సినిమా రూపొందనుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు హీరోయిన్లు రాఘవేంద్రరావు సరసన నటించనున్నారట. ఇప్పటికే ఒక హీరోయిన్ గా రాశిఖన్నా సెలెక్ట్ అయిపోయిందని సమాచారం. సొంత బ్యానర్ ఆర్కా మీడియా నిర్మాణంలో రాఘవేంద్రరావు హీరోగా చేయబోతున్నాడు. నిజానికి ఈ సినిమాలో యుంగ్ హీరో నాగశౌర్యను అనుకున్నప్పటికి అతడిని పక్కన పెట్టేశారట. ఇక ఈ సినిమాకు జనార్దన మహర్షి కథ అందిస్తుండగా.. సీనియర్ యాక్టర్ తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి దర్శకేంద్రుడు హీరోగా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో..!!