హైదరాబాద్ లో సైకిల్ పై హీరో అజిత్.. సందు దొరికితే రోడ్డు ఎక్కేస్తాడు..!

Update: 2021-02-25 16:06 GMT
హీరోలు తెర‌పై వీరోచిత పోరాటాలు చేస్తారు.. అద్భుత‌మైన యాక్టింగ్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు..  ఈ విష‌యాలు అంద‌రికీ తెలుసు. కానీ.. వారు ప‌ర్స‌నల్ గా ఏం చేస్తారు? అనే విష‌యాలు మాత్రం కొంద‌రికే తెలుసు. ఈ విష‌యంలో.. తమిళ స్టార్ హీరో అజిత్ రూటే సెప‌రేటు. ఎప్పుడు ఛాన్స్‌ దొరుకుతుందా? ఇష్ట‌మైన‌ట్టు తిరిగేద్దామా? అని చూస్తుంటాడు అజిత్‌. ఇదే రీతిలో హైద‌రాబాద్లో చ‌క్క‌ర్లు కొడుతూ కెమెరాల‌కు చిక్కేశాడు.

అజిత్ అమితంగా ఇష్ట‌ప‌డే విష‌యాలు చాలానే ఉన్నాయి. వీటిలో సైక్లింగ్, రైఫిల్ షూటింగ్, బైక్‌ రేసింగ్, పైలట్ డ్రైవింగ్, కుకింగ్‌.. ఇలా ఒక‌టేమిటి.. మ‌నోడికి చాలా ‘అభిరుచులు’ ఉన్నాయి. ఇటీవ‌లే బైక్ వేసుకొని దేశంలోని ముఖ్య‌మైన ప్రాంతాల‌ను చుట్టేసి వ‌చ్చాడు అజిత్‌. ఈ జర్నీలో కంటిన్యూస్ గా 10 వేల కిలోమీట‌ర్లు తిరిగేసి వ‌చ్చాడు.

తాజాగా.. హైద‌రాబాద్ లో రోడ్డుపై సైక్లింగ్ చేశాడు అజిత్‌. శంషాబాద్‌ విమానాశ్రయం నుండి మెహదీపట్నం వరకు, తిరిగి అరమ్‌ఘర్ చౌరాస్తా మీదుగా రామోజీ ఫిలిం సిటీ వ‌ర‌కు సైకిల్ తొక్కాడు. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో అజిత్ లేటెస్ట్ మూవీ ‘వాలిమై’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ లో విరామం దొరకడంతో సరదాగా సైకిల్ ఎక్కేసి భాగ్యనగరాన్ని చుట్టేసి వచ్చాడు అజిత్. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా.. ఇప్పటి వరకూ అజిత్ 30,000 కిలోమీటర్లు తిరిగి ఉంటాడట అజిత్. ఈ హీరో బిహేవియర్ తమకు ఎప్పుడూ కొత్తగా ఉంటుందని చెబుతున్నారు సహచరులు. ఇక, సినిమా గురించి చూస్తే.. విదేశాల్లో ఓ షెడ్యూల్ షూట్ చేయాల్సింది. ఇది మినహా దాదాపుగా పూర్తయినట్టే. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను దర్శకుడు వినోధ్ తెరకెక్కిస్తున్నారు.
Tags:    

Similar News