స్టార్ కోడలు తల్లి కాబోతోందా?

Update: 2019-09-24 07:27 GMT
టాలీవుడ్ అనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా సినిమా తారలకు సంబంధించి ఏ న్యూస్ అయినా సెన్సేషన్ గానే ఉంటుంది. ఇది కూడా ఒకరకంగా అలాంటిదే అని చెప్పొచ్చు. తనో స్టార్ హీరోయిన్. ఓ పెద్దింటి హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కెరీర్ స్లో ఆవుతుంది అనుకుంటే ఆ తర్వాత కూడా దివ్యంగా సాగుతూ ఇటీవలే భర్తకో బ్లాక్ బస్టర్ హిట్టు కూడా ఇచ్చింది. గత ఏడాది ఇండస్ట్రీ రికార్డు కొట్టిన సినిమాలు కూడా తన ఖాతాలో పడ్డాయి.

అయితే ఈ మధ్యకాలంలో ఈ హీరోయిన్ కొంత గ్యాప్ తీసుకుంది. తల్లి కాబోతోందంటూ అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదనే ప్రచారం ఓ మీడియా వర్గంలో ప్రచారం కావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి కథ వేరే ఉందట. పిల్లలు కావాలనే కోరిక బలీయంగా ఉన్నప్పటికీ అది సహజమైన పద్ధతిలో కాకుండా సరోగసి ద్వారా జన్మనివ్వాలని అనుకుంటున్నట్టు వినికిడి. గతంలో ఇదే తరహాలో ఓ సీనియర్ స్టార్ హీరో కూతురు పాపకు తల్లి కావడం ఈ సందర్భంగా చర్చకు వచ్చిందట.

సరోగసి అంటే కృత్రిమ పద్ధతి ద్వారా గర్భధారణ చేయడం. వయసు ఓపిక అన్ని ఉన్నప్పటికీ ఇలాంటి మార్గం ఎందుకు ఎంచుకుంటారు అనే సందేహం రావడం సహజమే కానీ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో న్యాచురల్ గా తల్లి కావాలంటే ఏడాది పైగా గ్యాప్ తీసుకోవాలి. ఆ తర్వాత కం బ్యాక్ ఇచ్చినా ఆఫర్స్ వస్తాయన్న గ్యారెంటీ లేదు. సో ఇది రిస్క్ లేని పద్ధతి. ఇది నిజమో  కాదో కానీ ఫిలిం నగర్ టాక్ అయితే జోరుగానే ఉంది. ఎలాగైతేనేం మొత్తానికి ఆ కుటుంబంలో కొత్త తరం వారసుడో వారసురాలో వస్తారన్న మాట


Tags:    

Similar News