అభిమానుల్లో దురభిమానులు వేరయా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు అభిమానం అంటే.. పాలభిషేకాలు.. పూలదండలు. ఆ తర్వాత అన్నదానం.. రక్తదానం.. నేత్రదానం వంటివి వచ్చి చేరాయి. ఫ్యాన్స్ కు తోడు యాంటీ ఫ్యాన్స్ అనే ట్రెండ్ కూడా పెరగడం ప్రారంభించింది. టెక్నాలజీ పుణ్యమా అని ట్రోలింగ్ కల్చర్ పెరిగిపోయింది.
గతంలో ఫ్యాన్స్ వైఖరి మారేందుకు ఓ తరం పట్టేసింది. గత మూడు-నాలుగేళ్లుగా ఈ ఫ్యాన్ కల్చర్ మరీ వేగంగా.. ఏటికేటా మారిపోతోంది. ఏటికేడాది కొత్త తరహాలో అభిమానం హద్దులు దాటుతోంది. ఉదాహరణకు 2015లో ఆయా హీరోల అభిమానులు.. తమ తమ హీరోల బాక్సాఫీస్ రికార్డులు.. వచ్చిన అవార్డుల గురించి విపరీతంగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాతి ఏఢాదికల్లా అంటే 2016లో యూట్యూబ్ రికార్డులు వచ్చి చేరాయి. ఏడాది తిరిగే పాటికి ఇది కూడా కామన్ అయిపోయింది.
2017లో ట్విట్టర్ పోల్స్ కల్చర్ విపరీతం అయిపోయింది. ఎవరు పడితే వారు పోల్స్ స్టార్ట్ చేసే అవకాశం వచ్చేసింది. అంతేకాదు.. ట్రాలింగ్ లో ఓ భిన్నమైన శైలి కూడా కనిపించింది. టామ్ క్రూజ్ ఫేస్ బుక్ పేజ్ లో.. ఎన్టీఆర్- మహేష్ ల అభిమానులు వాదులాడుకున్న తీరు ఆశ్చర్యం కలిగించింది. మహేష్ కేక.. మహేష్ తోపు అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఎటకారంగా పోస్టులు పెట్టి.. పొగుడుతూనే తెగ తిట్టి పోశారు.
అప్పటికి రియలైజ్ అయిన మహేష్ ఫ్యాన్స్.. అంతకు మించి రియాక్ట్ అయ్యారు. ఓ హాలీవుడ్ హీరో అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ లో ఇలాంటి ప్రవర్తన కారణంగా.. టాలీవుడ్ గురించి మొత్తం ప్రపంచ సినిమా రంగం మాట్లాడుకుంది. ఇప్పుడు 2018 వచ్చి రెండు నెలలు దాటిపోయింది. ఇప్పుడు కూడా మళ్లీ చాలానే మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే.. ఇప్పటికే కొన్ని మొదలైపోయాయి.
బర్త్ డే సెలబ్రేషన్స్ హంగామా.. ఆడియో లాంఛ్ లకు వచ్చిన జనాల కౌంట్.. ఫస్ట్ డే ఫస్ట్ షోకు థియేటర్ల నుంచి రెస్పాన్స్(ఫ్యాన్స్ అండ్ యాంటీ)..లాంటి వాటితో పాటు తమ హీరో కారు టైరుకు ఎక్కువ చక్రాలు ఉంటాయని కూడా కొట్టుకునే రోజులు రానున్నాయనే కామెడీలు కూడా వినిపిస్తున్నాయి.