లాక్ డౌన్ టైంలో ఆ హీరోకి ఇంట్లో పెళ్లి ప్రెజర్ ఎక్కువైందట..!

Update: 2020-04-22 15:30 GMT
సాధారణంగా పెళ్లీడుకొచ్చిన వారిని నీ పెళ్లెప్పుడంటూ కనిపించిన వారందరు అడుగుతుంటారు. అదే సెలెబ్రెటీలైతే మీడియా నుండి సోషల్ మీడియా దాకా పెళ్లెప్పుడంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు.. వారి పెళ్లి ఎప్పుడని స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు.. ఇలా ఆర్టికల్స్ కూడా రాసేస్తుంటారు. మన టాలీవుడ్ విషయానికొస్తే ఇప్పటికే దాదాపు అందరు పెళ్లీడు హీరోలకి పెళ్లిళ్లు జరిగిపోయాయి. ఎవరో ఒకరిద్దరు బ్యాచిలర్ హీరోలకు తప్ప. వారిలో కూడా కొందరికి ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోగా ఈ కరోనా మహమ్మరి కారణంగా పెళ్లి వేడుకలు వాయిదా పడ్డాయి. అయితే ఒక స్టార్ హీరో మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఆ హీరో గురించి ఎన్ని నెగిటివ్ రూమర్స్ వచ్చినా వాటిని జనాలు ఎక్కువగా పట్టించుకోరు కానీ పెళ్లి టాపిక్ వస్తే మాత్రం అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇన్ని రోజులు ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్తున్న ఈ హీరోకి ఆ సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు రావడంతో ఆయన పెళ్లిపై రూమర్స్ కూడా పెరిగిపోయాయి.

అంతేకాకుండా ఆ హీరోతో కలిసి నటించిన హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ బాలీవుడ్ మీడియా కూడా కోడైకూసింది. వారిద్దరు కలిసి చాలా సార్లు ఆ రూమర్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ రూమర్స్ డోస్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే 40లోకి వచ్చిన మన హీరో టాలీవుడ్  సల్మాన్ ఖాన్ అయిపోతాడేమో అని కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు కూడా కాస్త కంగారు పడుతున్నారు. ఇప్పటి దాకా ప్రతిసారి షూటింగ్ వుందని.. ఆ సినిమా కంప్లీట్ చెయ్యాలని.. పెళ్లి మ్యాటర్ నుంచి తప్పించుకుంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కావడంతో ఇంటికే పరిమితమైన మన హీరో ఇప్పుడు కుటుంబ సభ్యులకు దొరికిపోయాడు. దీంతో రోజూ పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తున్నారట. హీరో పెద్ద నాన్న ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు హీరోతో పెళ్లి గురించి చర్చలు జరుపుతున్నారట.

వాస్తవానికి రెండేళ్ల క్రితమే ఈ స్టార్ హీరో పెళ్లి జరిగిపోవాల్సింది. కానీ అదే సమయంలో మరో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడంతో అది పూర్తైన తర్వాత చేసుకుంటానని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమా పూర్తై రిలీజ్ అయ్యి కూడా చాలా రోజులు అవుతోంది. అందువల్ల ఈ ఏడాది కుటుంబ సభ్యులకు ఎదో ఒక నిర్ణయం చెప్పాలని.. పెళ్లి సంబంధాల గురించి సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు గాని ఈ ఏడాదిలోనే ఆ స్టార్ హీరో పెళ్లి గురించి ఒక క్లారిటీ వచ్చేలా కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఈ ఏడాదైనా మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అవుతాడేమో చూడాలి.
Tags:    

Similar News