నాలుగు అయిదు సంవత్సరాల క్రితం మీటూ అంటూ ప్రారంభం అయిన ఉద్యమం ఏ స్థాయిలో ఇండస్ట్రీని కుదిపి వేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు మీటూ అంటూ మీడియా ముందుకు తీసుకు వచ్చిన హీరోయిన్స్.. నటీమనులు తమ భారంను దించుకున్నారు. తాము ఎదుర్కొన్న లైగింక వేదింపుల తాలూకు విషయాలను చెప్పుకొచ్చారు. ఈమద్య కాలంలో ఇండస్ట్రీలో లైంగిక వేదింపులు చాలా వరకు తగ్గాయి అనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఏ బాంబు పేల్చుతారో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు అంతా కూడా ఆందోళనగా చూశారు. కొందరు హీరోలు ఈ విషయంలో బలయ్యారు. కొందరు కోర్టుకు వెళ్లి క్లీన్ చీట్ తెచ్చుకున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ కూడా క్లీన్ చీట్ ను తెచ్చుకున్నాడు.
మూడు సంవత్సరాల క్రితం హీరోయిన్ శృతి హరి హరన్ పోలీసులకు అర్జున్ లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు అంటూ ఫిర్యాదు చేసింది. ఆ సమయంలోనే ఆయన విచారనకు హాజరు అవ్వాల్సి వచ్చింది. షూటింగ్ పేరుతో తన ఒంటిపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఇబ్బందికి గురి చేశాడంటూ ఆమె ఆరోపించింది. షూటింగ్ రిహార్సల్స్ పేరుతో తనను పలు సార్లు వేదించాడు అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సుదీర్ఘ విచారణ తర్వాత సాక్ష్యాలు లేవంటూ పోలీసులు కేసును కొట్టి వేయడం జరిగింది. ఈ కేసులో శృతి హారి హరన్ సాక్ష్యాలు లేకుండా అర్జున్ పై ఆరోపణలు చేసిందంటూ పోలీసులు పేర్కొన్నారు.
అర్జున్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి సౌత్ ఇండియాలో మంచి పేరును దక్కించుకున్నాడు. దేశ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎంతో సీనియర్ అయిన అర్జున్ అలా చేశాడంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరి కొందరు మాత్రం ఆయన తీరును తప్పుబడుతు శృతి హరిహరన్ కు మద్దతుగా ఆందోళనలు చేశారు. ఆయన నిర్ధోశిత్వం బయట పడటంతో ఇప్పుడు ఆయన అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. కొందరు పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారని.. సెలబ్రెటీల మరియు స్టార్స్ పరువు తీయడమే లక్ష్యంగా వారు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.