బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. పదుల సంఖ్యలో సెలబ్రెటీలు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రముఖులు, గొప్ప వారు అనుకున్న వారు కూడా లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా కొందరు మహిళలు చేస్తున్న ఆరోపణలు బాలీవుడ్ ను షాక్ కు గురి చేస్తున్నాయి. కొందరు ఫిల్మ్ మేకర్స్ సినిమాల్లో ఛాన్స్ పేరుతో లైంగికంగా ఎంతగానో వేదించారంటూ మీటూ ఉద్యమంలో హీరోయిన్స్ మరియు కొందరు మహిళలు చెబుతున్న నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా తాను వేదింపులు ఎదుర్కొన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
25 ఏళ్ల క్రితం నేను తీవ్రమైన వేదింపులు ఎదుర్కొన్నాను, అవి లైంగిక వేదింపులైతే కావు, కాని ఆ వేదింపులు తల్చుకుంటే ఇప్పటికి కూడా నాకు ఒళ్లు మండుతోందని పేర్కొన్నాడు. నా పరిస్థితి ఎవరికి రావద్దని ఇప్పటికి కోరుకుంటానంటూ సైఫ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను సమాజంలో ఒక గౌరవం ఉన్న వ్యక్తిని కనుక ఆ వేదింపులను బయట పెట్టలేనంటూ చెప్పుకొచ్చాడు.
మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా ఇండియాలో మొదలైన మీటూ ఉద్యమం తప్పు చేసిన వారి నిజ స్వరూపాయలు బయటకు రావడం మంచి పరిణామం. ఇకపై అయినా మనం మహిళల పట్ల జాగ్రత్తగా ఉందాం, వారిని గౌరవించడంతో పాటు, వారితో సరైన విధంగా నడుచుకుందామంటూ సైఫ్ పేర్కొన్నాడు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వారి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సైఫ్ కోరాడు.
ఇకపై తాను లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో వర్క్ చేయబోనన్నాడు. సైఫ్ మాదిరిగా ఇతర ఫిల్మ్ మేకర్స్ మరియు నటీనటులు కూడా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో వర్క్ చేయడం మానేయాలని మహిళ సంఘాల వారు, మీటూ ఉద్యమ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.