స్టార్ డైరెక్టర్ కు చుక్కలు చూపిస్తున్న స్టార్ హీరో!

Update: 2020-01-28 04:11 GMT
ఇల్లు అలక గానే పండగ కాదు అని తెలుగు లో ఒక సామెత. పాతదే కదా.. ఇప్పటి అంతర్జాల సామాజిక మాధ్యమాల తరానికి సరిపోదేమో అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. ఇప్పటికీ ఆ సామెత చాలా అంశాలకు కరెక్ట్ గా సరి పోతుంది. ముఖ్యంగా ఒక స్టార్ డైరెక్టర్ కు సరిగ్గా సరి పోయేలా ఉందని ఫిలిం నగర్ కోడై కూస్తోంది.

ఆయన ఓ టాప్ డైరెక్టర్. ఆయన సినిమా చేస్తానంటే నో చెప్పే స్టార్ హీరోలు దాదాపుగా లేరు. ఆ డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ అలాంటిది. కానీ ఆయనేమో ఒక పెద్ద స్టార్ తో సినిమా తెరకెక్కించాలని పట్టుబట్టుకుని కూర్చున్నాడు. సినిమా త్వరగానే సెట్ అయింది కానీ పట్టాలెక్కే సరికే చాలా సమయం వృధా అయింది. సాధారణం గా ఈ టైం లో ఆయన రెండు సినిమాలు చేసేవారేమో. లేట్ అయితే అయింది ఎలాగూ బౌండ్ స్క్రిప్ట్ ఉంది కదా.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటే అది కూడా కుదిరేలా లేదట. ఈ కాంపౌండ్ లో చేయడం డైరెక్టర్ గారికి మొదటి సారి. ఇప్పుడిప్పుడే ఈ సంప్రదాయాలు అలవాటవుతున్నాయి. హీరో గారు దర్శకుడి పని విషయం లో వేళ్లు పెడుతున్నారని.. ఈ ఫింగరింగ్ ఎక్కువ కావడం తో ఏం చెయ్యాలో అర్థం కాక దర్శకుడు తల పట్టుకుంటున్నారట.

ఈ దర్శకుడు కెరీర్ ఆరంభంలో మరో దర్శకుడి వద్ద పని చేశారు. అప్పట్లో ఆయనతో తెగ ఇబ్బంది పడ్డారట. ఇప్పుడు ఈ హీరోగారి ఫింగరింగ్ దెబ్బకు మునుపటి రోజులు.. అప్పటి ఫీలింగ్స్ గుర్తుకొస్తున్నాయని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. నిజమే.. సినిమా సెట్ అవగానే పండగ కాదు. ఆ తర్వాత కదా అసలు సినిమా కనిపించేది. ప్రస్తుతానికి ఆ దర్శకుడికి అలాంటి సినిమానే కనిపిస్తోందట!
Tags:    

Similar News