ఇంకో రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. ఎక్కడ చూసినా వేడెక్కిన రాజకీయ వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి జనసేన ఎంట్రీ వల్ల త్రిముఖ పోటీ అనివార్యం కావడంతో పోరు రసవత్తరంగా మారింది. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి వదిలేశాక సినిమా రంగం నుంచి యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉన్నవాళ్లు ఎవరూ లేరు.
గత ఎన్నికలలో ఆంధ్రలో రెండు పార్టీలు టిడిపి వైఎస్ఆర్ తెలంగాణాలో టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే వార్ జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి మరీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేశాడు. రామ్ చరణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ తదితరులు నేరుగానే మద్దతు తెలిపేందుకు ఏకంగా పవన్ ఉన్న చోటికే వస్తున్నారు. ఇక వైఎస్ ఆర్ లో చేరిన నటీనటుల లిస్టు చాలా పెద్దదిగా ఉన్న తరుణంలో ప్రభావం విశేషంగానే ఉండబోతోందని విశ్లేషకుల అంచనా
ఇదిలా ఉండగా ఇవాళ రజనికాంత్ దర్బార్ ఫస్ట్ లుక్ వచ్చింది. ఎన్నడూ లేనిది గత రెండేళ్ళుగా విపరీతమైన స్పీడ్ తో సినిమాలు చేస్తున్న రజని రాజకీయ పార్టీని అనౌన్స్ చేశాక ప్రాజెక్ట్ లు సైన్ చేయడంలో దూకుడు పెంచాడు. ఇకపై అరవ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడు అనే విషయంలో కొంత అయోమయం అయితే నెలకొంది. కమల్ ఆర్భాటంగా మొదలుపెట్టిన ఇండియన్ 2ని పార్టీ కోసమే ఆపెయబోతున్నాడు అనే టాక్ ఇప్పటికే తమిళనాడులో ఉంది. ఇది పక్క రాష్ట్ర వ్యవహరమని కొట్టిపారేయడానికి లేదు. ఇప్పుడున్న సీనియర్ హీరోలకు వీళ్ళ అనుభవాలే దిక్సూచిగా మారుతాయి
ఒకప్పుడు జెండాను భుజాన మోసుకుని చంద్రబాబు నాయకత్వంలో టిడిపి కోసం ప్రాణాలకు తెగించి మరీ ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్ళుగా తెలుగుదేశం పదం కూడా ఉచ్చరించడం లేదు. కెరీర్ బిల్డింగ్ మీద ఫోకస్ పెట్టాడు. స్వంత బావ అయినా గల్లా జయదేవ్ కోసం మహేష్ బాబు చొరవ తీసుకుని ట్వీట్లు పెట్టె లాంటి పనులు చేయడం లేదు. పెదనాన్న కృష్ణంరాజు బిజేపిలో ఉన్నా ప్రభాస్ పొరపాటున కూడా ఆ విషయాలు ప్రస్తావనకు తెచ్చేందుకు ఇష్టపడడు.
బాలకృష్ణ ముందు నుంచి యాక్టివ్ గా ఉండటంతో పాటు సిట్టింగ్ ఎమెల్యే కాబట్టి రంగంలోనే ఉన్నాడు. ఇక వెంకీ నాగ్ లు ఎప్పుడూ ఈ వైపు ఆలోచించలేదు. మోహన్ బాబు మాత్రం క్లియర్ స్టాండ్ తీసుకుని వైసిపిలో చేరిపోయారు. ఇక్కడ చెప్పిన వారందరికీ ఒకరికి మరొకరికి లింకులు ఉన్నట్టు అనిపించినా రాజకీయాల విషయంలో మాత్రం మన స్టార్లు స్వంత నిర్ణయాలకే కట్టుబడుతున్నారు తప్ప ప్రభావితం చెంది ఎవరో చెప్పినట్టు వినే పరిస్థితి కనిపించడం లేదు. వీటి తాలుకు ప్రభావాలు పరిణామాలు ఎలా ఉంటాయో రేపు ఫలితాలు వచ్చాక ఓ అవగాహన వస్తుంది కాని మొత్తానికి పాలిటిక్స్ విషయంలో మాత్రం స్టార్ల రూటే సెపరేటు అని అర్థమైపోయిందిగా