సినిమా అన్నాక మార్పులు చేర్పులు సహజంగా జరిగేవే. ఒకరితో అనుకుని ఇంకొకరితో తీయాల్సి రావడం అది మిస్ అయ్యిందనుకుని సదరు హీరో బాధ పడటం చాలా సార్లు చూసాం. మీడియం రేంజ్ హీరోల విషయంలో జరిగినప్పుడు పెద్దగా హై లైట్ కాదు కాని స్టార్ల ప్రాజెక్ట్స్ లో జరిగే కీలకమైన మార్పులు పెద్ద చర్చకే దారి తీస్తాయి. మొన్న సుకుమార్
తో సినిమా చేయడం లేదని మహేష్ ప్రకటించడం ఇంకా దాని తాలూకు సెగలు రేగుతూనే ఉన్నాయి. ఇలా జరగడం మొదటిసారి కాదు కాని ఏడాది వ్యవధిలోనే ఇది పలుమార్లు రిపీట్ కావడం గమనార్హం.
కొంచెం వెనక్కు వెళ్తే తేజ దర్శకత్వంలో సురేష్ సంస్థ వెంకటేష్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేసి కొంత షూటింగ్ కూడా జరిపింది. ఆటా నాదే వేటా నాదే అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసి పెట్టారు. ఓ ఇద్దరు ముగ్గురు రచయితలు స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు. నారా రోహిత్-ఈషా రెబ్బా-శ్రేయలను కాస్టింగ్ గా ఫిక్స్ చేశారు. అంతా సవ్యంగా ఉందనుకున్న టైంలో క్రియేటివ్ డిఫరెన్స్ పేరుతో దాన్ని రద్దు చేసేశారు. సీన్ లోకి దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి ఎఫ్2 వచ్చింది. దాని తర్వాత జరిగిన కథ తెలిసిందే
అక్కడితో అయిపోలేదు. ఇదే తేజను బాలకృష్ణ పిలిచాడు. ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు అప్పజెప్పి ఇప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా ప్రముఖులను పిలిచి అట్టహాసంగా ఓపెనింగ్ షాట్ తీయించి మొదలుపెట్టాడు. కొద్దిరోజులయ్యాక పైన చెప్పిన కారణమే చూపించి తేజ బయటికి వస్తే ఎక్కడో ముంబైలో మణికర్ణిక షూటింగ్ లో ఉన్న క్రిష్ ని పిలిపించి బాధ్యతలు అప్పగించారు. తర్వాత జరిగిన పరిణామాలు ఎన్టీఆర్ రెండు భాగాల ఫలితాన్ని కళ్లారా చూశాం.
ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. ఆరు నెలల క్రితమే ప్రకటించి ఇటీవలే కథ ఒకే అయ్యింది రేపో ఎల్లుండో షూటింగ్ ప్రారంభమవుతుంది అనుకుంటున్న టైంలో మహేష్ సుక్కుతో చేయనని చెప్పేశాడు. అంతకు ముందే అల్లు అర్జున్ తో పచ్చ జెండా ఊపించుకున్న సుకుమార్ కు సినిమా చేజారలేదు కానీ ఏడాది సమయంతో పాటు బన్నీ కన్నా చాలా పెద్ద మార్కెట్ ఉన్న మహేష్ తో రెండో సారి చేసే ఛాన్స్ మిస్ అయ్యాడు. ఎవరి నిర్ణయం కరెక్టో తేలాలంటే మహేష్ అనిల్ రావిపూడి ప్లస్ బన్నీ సుక్కు ఈ రెండు సినిమాల ఫలితాలు వచ్చాకే తెలుస్తుంది. ఏది ఏమైనా ఇలా హీరోలు దర్శకులను మార్చడం అనే ట్రెండ్ ఈ మధ్య కాస్త ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. దీనికి మీడియం రేంజ్ హీరోలూ మినహాయింపు కాదు. వాటినీ ఇక్కడ ప్రస్తావిస్తే చోటు సరిపోదు. మరోసారి వాటివైపు కూడా ఓ లుక్ వేద్దాం