టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని జానూ సినిమా పరాజయం తర్వాత సినిమాల విషయంలో కాస్త నెమ్మదించింది. ప్రస్తుతం చాలామంది దర్శకులు స్క్రిప్టులు పట్టుకొని ఆమె దగ్గరకి వస్తున్నా ఏ స్క్రిప్ట్ కూడా ఓకే చేసే ఆలోచనలో లేదట సామ్. దాదాపు కెరీర్ ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకున్న ఈ భామ ఇక సినిమాలకు కొంతకాలం విరామం ఇవ్వాలని అనుకుంటుందట.
ఏ మాయచేసావే సినిమా నుండి ఇప్పటివరకు ప్రతి ఏడాది సమంత నుండి సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆమె కూడా అభిమానులు ఎక్సపెక్ట్ చేసినట్లుగా నటనకు ప్రాధాన్యమున్న సినిమాలే చేస్తూ వచ్చింది. ఇన్నేళ్ల నాన్ స్టాప్ యాక్టింగ్ తర్వాత ఓ భారీ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి బ్రేక్ తీసుకోవాలని సామ్ ఆలోచిస్తున్నట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.
గత కొన్నేళ్లుగా సామ్ స్క్రిప్ట్‌లను ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్త పడుతుంది. జాను ప్లాప్ తర్వాత తెలుగులో సమంత ఏ చిత్రానికి సంతకం చేయలేదు. మధ్యలో కొన్ని ఊహగానాలు వ్యక్తం అయినప్పటికీ గుణశేఖర్ దర్శకత్వం వహించబోయే శకుంతల మూవీకి సమంత సంతకం చేసింది. ప్రస్తుతం భారీ మూవీ సెట్ వర్క్ జరుగుతోందట. అలాగే శకుంతల రెగ్యులర్ షూట్ మార్చి 20 నుండి హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత సమంత లాంగ్ బ్రేక్ తీసుకోనుందట. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులపై సంతకం చేయకూడదని సమంతా నిర్ణయించుకుంది. శకుంతలం షూటింగ్ త్వరగా పూర్తిచేసి విరామం తీసుకోనుందట. మళ్లీ ఏడాదిన్నర విరామం తర్వాత సామ్ తిరిగి సినిమాల్లోకి వస్తుందని టాక్. ప్రస్తుతం సామ్ కాతువకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో నటిస్తోంది.