హాలీవుడ్ లో గత రెండు సంవత్సరాల కాలంగా ఓటీటీ రిలీజ్ లు భారీగా ఉంటున్నాయి. ఇండియాలో ఓటీటీ మార్కెట్ విస్తరించేందుకు మరో రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్న సమయంలో మహమ్మారి వైరస్ వచ్చి మొత్తం తారు మారు చేసింది. గత మూడు నెలలుగా థియేటర్లు ఓపెన్ లేక పోవడంతో ఓటీటీ రిలీజ్ కు చాలా సినిమాలు వెళ్తున్నాయి. మరో మూడు నెలల వరకు కూడా థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరిన్ని సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యే అవకాశం ఉందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఫిల్మ్ మేకర్స్ ఓటీటీ రిలీజ్ కు ఆసక్తి చూపిస్తుంటే కొందరు మాత్రం ఓటీటీని వ్యతిరేకిస్తున్నారు.
ఇప్పటికే రెడీగా ఉన్న సినిమాలను ఓటీటీ వారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండగా కొందరు ఫిల్మ్ మేకర్స్ సిద్దంగా లేరు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా ఒక ఇంటర్వ్యూలో ఓటీటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. నేను సాంప్రదాయబద్దమైన పద్దతిలోనే సినిమాలు చూసేందుకు ఇష్టపడతాను. థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసి ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తాను. సాంప్రదాయ పద్దతైన సినిమాలకు ఎప్పటికి అంతం ఉండదు. మనం అంతా కూడా థియేటర్లలో సినిమా చూపించేందుకు ఆసక్తి చూపించాల్సిన అవసరం ఉంది అంటూ పరిణితి చోప్రా చెప్పుకొచ్చింది.