సినీ ప్రపంచంలో తారలకు వ్యసనాలు ఎక్కువే ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఆది నుంచి అది బయటపడుతూనే ఉంది. మద్యం, జల్సాలు, పార్టీలు, డ్రగ్స్ కూడా తీసుకున్న ప్రముఖులు ఎందరో మనకు కనిపిస్తూనే ఉన్నారు. బాలీవుడ్ లో, శాండల్ వుడ్ లో ఇలానే డ్రగ్స్ తీసుకున్న ప్రముఖుల కేసులు, రాకెట్ ముఠాలు ఎన్నో వెలుగుచూశాయి. బాలీవుడ్ లో అయితే హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో డ్రగ్స్ కేసు ఎంత దుమారం రేపిందో చూశాం.
తాజాగా ఒక స్టార్ హీరోయిన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది. బంగ్లాదేశ్ అగ్రకథానాయిక పోరీ మోనీ (28) అరెస్ట్ బంగ్లాదేశ్ లో సంచలనం సృష్టించింది. పెద్దఎత్తున డ్రగ్స్ కలిగి ఉందన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ‘రాబ్’ ఆమెను అరెస్ట్ చేసింది.
అయితే ఇదే హీరోయిన్ పోరీ మోనీ ప్రముఖ బంగ్లాదేశ్ వ్యాపారవేత్తపై లైంగిక-హత్యారోపణలు చేసింది. అది జరిగిన కొద్దిరోజులకే ఆమె అరెస్ట్ కావడంతో ఇందులో కుట్ర ఉందని.. న్యాయం చేయాలని ఆమె అభిమానులు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను న్యాయం కోసం నిలదీస్తున్నారు.
తాజాగా పోలీసులు ఢాకాలోని బనానీలో ఉన్న ఆమె ఇంటికి చేరుకొని సోదాలు నిర్వహించారు. ఆ పై రాత్రి ఆమెను అరెస్ట్ చేసి హెడ్ క్వార్టర్ కు తరలించారు. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున మత్తు, మాదకద్రవ్యాలు , ఫారిన్ లిక్కర్ దొరికాయని.. అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు. గురువారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టగా.. నాలుగు రోజుల రిమాండ్ విధించింది.
పోరీ మోనీ చిన్న వేశాలు వేస్తూ స్టార్ హీరోయిన్ గా బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీలో ఎదిగింది. జూన్ 8న ప్రముఖ వ్యాపారవేత్త , రాజకీయ నాయకుడు నజీర్ ఉద్దీన్ మహ్మద్ మీద లైంగిక ఆరోపణలు చేసింది.బోట్ క్లబ్ వద్ద నజీర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.
ఒక స్టార్ హీరోయిన్ లైంగిక ఆరోపనలు చేయడం సినీ పరిశ్రమను కుదిపేసింది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వంలోని మంత్రులతో స్నేహం ఉండడంతో కేసు నమోదు కాకుండా నజీర్ తప్పించుకున్నాడన్న ప్రచారం మొదలైంది. ఈ తరుణంలో నటికి సోషల్ మీడియాలో, ప్రజల్లో మద్దతు వెల్లువెత్తింది.
ఇక తనకు న్యాయం చేయాలంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఆమె ఫేస్ బుక్ ద్వారా విజ్ఞప్తి చేసింది. దీంతో నజీర్ ను, ముగ్గురు మహిళలను, డ్రగ్ డీలర్ తుహిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నజీర్ అరెస్ట్ అయిన వారానికే గుల్షన్ అల్ కమ్యూనిటీ వాళ్లు పోరీ మోనీపై ఉల్టా కేసులు దాఖలు చేశారు. నజీర్ కు చెందిన క్లబ్ యే ఇదీ.. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదు కాగా.. తాజాగా అరెస్ట్ చేశారు.
తాజాగా పోరీ మోనీ ఫేస్ బుక్ లో ఆందోళన వ్యక్తం చేసింది. తన ఇంటి గేట్ ను ధ్వంసం చేవఆరని.. చంపాలని చూస్తున్నారని.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చెందింది. కాసేపటికే ఆమెను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడంతో ఇదంతా వ్యాపారవేత్త నజీర్ కుట్ర అన్న అనుమానాలు కలుగుతున్నాయి.