ఆ సీన్లు చేయనని చెప్పి చేసిన స్టార్ హీరోయిన్

Update: 2021-11-12 05:09 GMT
చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేకపోవటం ఒక ఎత్తు. గతంలో చెప్పిన మాటకు తాజాగా చేసిన దానికి పొంతన లేదు కదా? అన్న ప్రశ్నకు ఊహించని రీతిలో రియాక్టు అయ్యింది కన్నడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న రచిత. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘లవ్ యూ రచ్చు’. ఈ సినిమా విడుదల నేపథ్యంలో డింపుల్ క్వీన్ గా పిలిచే రచిత మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఆమె నటించిన బోల్డ్ సీన్లపై రిపోర్టర్లు ప్రశ్నించినప్పుడు ఆమె నోటి నుంచి వచ్చిన సమాధానాలు వింటే అవాక్కు అవ్వాల్సిందే.

గతంలో హీరో ఉపేంద్రతో ఈ బ్యూటీ ఒక మూవీ చేశారు. అందులో కొన్ని బోల్డ్ సీన్లలో నటించటం.. వాటిని చూసిన ఆమె తల్లిదండ్రులు బాధ పడినట్లుగా చెప్పిన ఆమె.. ఇకపై తాను అలాంటి సీన్లు చేయనంటే చేయనని చెప్పారు. తాజా మూవీలో మాత్రం అందుకు భిన్నంగా ఆమె చెలరేగిపోయి చేసిన సీన్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో చేయనని చెప్పి.. ఇప్పుడు అలాంటి సీన్లు ఎలా చేస్తారన్న ప్రశ్నను సంధించారు ఒక రిపోర్టర్.

దీనికి బదులిచ్చిన ఆమె.. ‘మిమ్మల్ని ఒకటి అడుగుతాను. పెళ్లి తర్వాత మీరేం చేస్తారు. సాధారణంగా అందరూ చేసేది రొమాన్సే కదా.. అదే మా మూవీలోనూ చూపించాం’ అంటూ ఎదరుదాడి తరహాలో ఆన్సర్ చేసింది. గతంలో తాను అలాంటి సీన్లు చేయనని చెప్పిన మాట వాస్తవమేనని.. కానీ అలా చెప్పిన తాను మళ్లీ అలాంటి సీన్లు చేయటానికి కారణం ఏమిటో.. సినిమా విడుదలయ్యాక తెలుస్తోందని ఊరిస్తోంది. మాట అనటం.. అందుకు భిన్నంగా వ్యవహరించటం చూస్తుంటే.. సీనిమా ప్రమోషన్ కోసం తన వంతుగా చేస్తున్న ప్రయత్నాలుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News