సెలెబ్రెటీ స్టేటస్ సంపాదించడం.. లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకోవడం బాగానే ఉంటుంది. తనను చూడ్డానికి వేలమంది ఎదురు చూస్తుంటే.. అభివాదాలు చేస్తుంటే.. కేరింతలు కొడుతుంటే ఇంకా బాగుంటుంది. కానీ అభిమానం దాన్ని మించి హద్దులు దాటితేనే సమస్య. ముఖ్యంగా హీరోయిన్లకు ఉండే ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గుంపుగా వచ్చి మీద పడిపోవడాలు.. ఒంటిపై చేయి వేయడాలు.. నొక్కేయడాలు.. ఇలా చాలా పరిణామాలు జరిగిపోతుంటాయి. ఈ మధ్య కాలంలో హీరోయిన్లకు ఈ సమస్య బాగా ఎక్కువైపోయింది. చాలామంది స్టార్ హీరోయిన్లు ఇలా చాలా ఇబ్బంది పడ్డారు.
అందులోనూ ఒక తెలుగు స్టార్ హీరోయిన్ కు జనాల్లోకి వెళ్లడం అంటేనే చిరాకొచ్చేసింది. ఆమెకు ఇటీవల కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అలాగని ప్రమోషనల్ ఈవెంట్లలో.. వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండలేదు. దీంతో ఆమె తప్పక ఇద్దరు బౌన్సర్లను నియమించుకుంది. వాళ్లకు భారీగా పేమెంట్ కూడా ఇస్తోంది. ఈ మధ్య ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ ఇద్దరు బౌన్సర్లు తోడుగా ఉంటున్నారు. తనకు రక్షణ వలయం ఏర్పాటు చేస్తున్నారు. ఆమెను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. చివరికి షూటింగులకు కూడా ఆ ఇద్దరు బౌన్సర్లను వెంటబెట్టుకుని వస్తోందా హీరోయిన్. తను ఎక్కడికి వెళ్లినా వెంట ఆ బౌన్సర్లు ఉంటుండటంతో యూనిట్లో వాళ్లకు ఇబ్బంది ఎదురవుతోందట. ఐతే ఇంతకుముందు ఎదురైన చేదు అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ఆ హీరోయిన్ అస్సలు రాజీ పడట్లేదట. ఈ బౌన్సర్లను బేర్ చేయడం కొంచెం ఖరీదైన వ్యవహారమే అయినా.. ఆమె వాళ్లను ఇలాగే మెయింటైన్ చేయాలని ఫిక్సయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/