స్వాతంత్ర్య సమర యోధుల కథలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమ వివిధ భాషల్లో సమర యోధుల కథలు వెండి తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు ..నాలుగు చిత్రాలకు సంబంధించి ప్రకటనలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్ కూడా యోధిరాలి జీవిత కథ కోసం నేను సైతం అంటూ ముందుకొచ్చింది.
'ఆయే వతన్..మేరే వతన్' స్వాతంత్ర్య సమరయోధురాలు ఉషా మెహతా జీవితం ఆధారంగా దర్బార్ ఫారిక్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఉషా పాత్రకి సారాని సంప్రదించగా అమె కథ పూర్తిగా వినకుండానే అంగీకరించిందిట. యోధురాలి కథలో నటించే అవకాశం రావడమే పరమావధిగా భావించి స్ర్కిప్ట్ వినకుండా ఒప్పుకుందిట.
దీంతో ఫారిక్ సంతోషంగా వ్యక్తం చేసాడు. ఆ తర్వాత ఫారిక్ కొద్ది రోజులకి పాత్ర గురించి చెప్పగా ఎంతో ఎగ్జైట్ అయినట్లు తెలిపారు. ఇప్పటికే స్ర్కిప్ట్ అయింది. త్వరలోనే సెట్స్ కి వెళ్తాం. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటీష్ వారి నిబంధనలకు విరుద్దంగా రేడియో నిర్వహించిన ఉషా మెహతా జీవితమే ఈ కథ. ఆమె కథలో ఎంతో ఎమోషన్ ఉంది.
ఇప్పటివరకూ తెరకెక్కిన సమర యోధుల కథకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఆ పాత్రకి సంబంధించి అన్ని రకాల అధ్యయనాలు..పరిశోధలను సారా పూర్తి చేసిందిట. ఆ పాత్ర ఎంతో స్ఫూర్తిని నింపుతుందని.. ఇలాంటి అవకాశం కల్పించినందుకు ఫారిక్ కి ధన్యవాదాలు తెలిపింది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పై కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించడం విశేషం.
సారాకిది గొప్ప అవకాశమే . కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి సాహసోపేతమైన పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఇలాంటి ఛాన్స్ రావడం చాలా రేర్. కానీ సారా సాధించింది. మరి ఈ బయోపిక్ అమ్మడి జీవితానికి ఎలాంటి టర్నింగ్ ఇస్తుందో చూడాలి.
ఇప్పటికే సారా స్నేహితురాలు..అతిలోక సుందరి డాటర్ జాన్వీ కపూర్ ఎయిర్ పైలెట్ 'గుంజెన్ సక్సెనా జీవి కథలో నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు.