నటవారసుల వెల్లువ బాలీవుడ్ ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. సోనాక్షి సిన్హా.. సోనమ్ కపూర్ లాంటి సీనియర్ల బాటలో ఆలియా భట్ పెద్ద సక్సెసైంది. అటుపై జాన్వీ కపూర్ - సారా అలీఖాన్ - అనన్య పాండే - తారా సుతారియా కథానాయికలుగా ఆరంగేట్రం చేశారు. జాన్వీ- అనన్య- తారా వీళ్లందరినీ కరణ్ జోహార్ వెండితెరకు పరిచయం చేశారు. ప్రస్తుతం నటవారసురాళ్లు వరుసగా అవకాశాలు అందుకుంటూ వేడెక్కిస్తున్నారు. ఆ క్రమంలోనే కింగ్ ఖాన్ షారూక్ నటవారసురాలు సుహానాపైనే అందరి కళ్లు. ఈ అమ్మడు ఖాన్ దాదా వారసురాలిగా ఏం చేయబోతోందో? అంటూ వెయ్యి కళ్లతో అభిమానులు వేచి చూస్తున్నారు.
ఇక సుహానా ఇప్పటికే విదేశాల్లో చదువులు పూర్తి చేసుకుని నటశిక్షణ తీసుకునేందుకు రెడీ అవుతోంది. అందుకు లండన్ (బ్రిటన్) వెళ్లనుంది. గత ఏడాది సడెన్ గా సుహానా వోగ్ ఫోటోషూట్ తో పీక్స్ లో విరుచుకుపడడం తెలిసిందే. కింగ్ ఖాన్ చాలా క్లారిటీగా సుహానా కథానాయిక అవుతుందని ప్రకటించి సర్ ప్రైజ్ ఇచ్చారు. అప్పటి నుంచి సుహానా ఏ ఈవెంట్ కి వెళ్లినా మీడియా కెమెరాలు తననే వెంటాడుతున్నాయి. సుహానా ఏ ఫోజిచ్చినా వెంటనే కాప్చుర్ చేసేస్తూ జనాల ముందుకు తెచ్చేస్తున్నాయి. ఇక సుహానా సైతం ఎప్పటికప్పుడు తన సెల్ఫీలు.. ఫోటోలు.. వీడియోలు ప్రతిదీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో అసాధారణ ఫాలోయింగ్ తెచ్చుకుంది.
తాజాగా మరోసారి సుహానా వార్తల్లోకి వచ్చింది. సుహానా ఈసారి అల్ట్రా మోడ్రన్ చీరకట్టులో గుబులు రేపుతోంది. పక్కాగా న్యూ స్టైల్ లో చీరకట్టి మతి చెడగొట్టింది. అసలే పెళ్లికి వెళ్లింది. అక్కడ స్నేహితురాళ్లతో ఓ రేంజులో చెలరేగింది. పూర్తిగా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నా అందరి కళ్లు సుహానా స్టైల్ పైనే. సుహానా తన డార్క్ రంగులో కలిసిపోయే ఆలివ్ గ్రీన్ డిజైనర్ చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ బాటమ్ లో డార్క్ గ్రీన్ సల్వార్ ని ధరించింది. ఇక ఈ ఫోటోల్ని సుహానా క్లోజ్ ఫ్రెండ్ ఆలియా చిబ్బా సోషల్ మీడయాలో షేర్ చేసింది. ఇంతకీ ఎవరి పెళ్లికి వెళ్లారు? అంటే కోల్ కతలోని సుహానా మదర్ గౌరీఖాన్ చుట్టాలమ్మాయ్ పెళ్లికి వెళ్లారట. అందుకే గౌరీఖాన్ సైతం ఈ పెళ్లి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అదన్నటమాట!!