"సినిమా" .. ప్రేక్షకులను అమితంగా ప్రభావితం చేసే మాధ్యమం ఇది. అత్యంత వినోదాన్ని పంచేది కూడా ఇదే! అందుకే సినిమా అంటే జనాలకు ఓ మోజు. నటులు అంటే యమా క్రేజు. అయితే.. "పురుషులందు పుణ్యపురుషులు" అన్నట్టుగా.. నటుల్లోన హీరోలు వేరయా.. అందునా అగ్రహీరోలు మరింత వేరయా అన్నది అందరికీ తెలిసిందే. ప్రజాభిమానమే వారిని ఆ స్థాయిలో నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే.. ఆ స్టార్ డం హీరోలకు కిక్కిస్తే.. నిర్మాతలకు మాత్రం చిక్కులు తెస్తోంది.
*"అగ్ర" తాంబూలం..
ఒక సినిమా రూపుదిద్దుకోవాలంటే.. 24 క్రాఫ్ట్స్ పనిచేయాలి. ఈ విభాగాల్లో ఎవరికి వారు ఎంత సమర్థవంతంగా పనిచేస్తే అంత మంచి ఔట్ పుట్ వస్తుంది. ఆ సినిమా ప్రేక్షకులను అంతగా అలరిస్తుంది. అయితే.. సినిమా చిత్రీకరణలో 24 ఫ్రేమ్స్ అంతర్భాగమైనా.. గుర్తింపు మాత్రం ఐదారు విభాగాలకే దక్కుతోంది! గుర్తింపు సంగతి పక్కనపెడితే.. పారితోషికం కూడా అంతే. ఈ రెమ్యునరేషన్ లోనూ అగ్ర తాంబూలం నటులదే!
*హీరో వర్షిప్..
అభిమానుల మనసుల్లో హీరోలు ఇలవేల్పులు. తమ అభిమాన హీరోలకోసం ఏం చేయడానికైనా ఫ్యాన్స్ సిద్ధంగా ఉంటారు. లక్షలు, కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సినీ హీరోలు.. వారిని అలరించడానికి నిత్యం ప్రయత్నిస్తుంటారు. ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు చేయడానికి తపిస్తుంటారు. తద్వారా తమ ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అసలు చిక్కంతా ఆ తర్వాతే మొదలవుతోంది. తాము నటించిన చిత్రాలు విజయాలు సాధిస్తుంటే.. ఒక్కో మెట్టూ ఎక్కుతున్న హీరోలు.. తమ రెమ్యునరేషన్ సైతం అదే రీతిలో పెంచేస్తున్నారు. ఈ పరిణామం క్రమంగా.. యావత్ సినిమా ఇండస్ట్రీపైనే తీవ్రంగా పడింది.
* ప్రొడక్షన్ కాస్ట్ లో మెజారిటీ షేర్..
తొలితరం నటులు.. ఇప్పుడు సీనియర్లుగా ఉన్న రెండో తరం హీరోలు మొదట్లో రీజనబుల్ రెమ్యునరేషన్ తీసుకునేవారు. తీసుకునే వారు అనేకంటే.. నిర్మాతలు ఇచ్చేవారు అంటే బాగుంటుంది. ఆ తర్వాత కాలంలో సినిమా విస్తృతి పెరగడం.. బిజినెస్ బాగా విసరించడంతో కష్టానికి తగిన ప్రతిఫలం దాటి పారితోషికం తీసుకోవడం మొదలైంది. ఈ అత్యధిక పారితోషికం అనేది ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. హీరో రేంజ్ ను నిర్ణయించడానికి ఓ కొలమానం లా మారిపోయింది. అంటే.. ఎంత ఎక్కువ పారితోషికం తీసుకుంటే అంత గొప్ప హీరో అనే మెసేజ్ ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో.. అప్పటికే ఇమేజ్ చట్రంలో ఉన్న హీరోలు తమ స్టార్ డం నిరూపించేందుకైనా భారీగా డిమాండ్ చేసే పరిస్థితులు ఇండస్ట్రీలో నెలకొన్నాయి. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన తాజా చిత్రం "బచ్చన్ పాండే"కు రూ.99 కోట్లు తీసుకుంటున్నట్టు అనధికార సమాచారం. తెలుగు సినిమా మార్కెట్ ను బట్టి ఇక్కడి హీరోలు కూడా అందినకాడికి పిండేస్తున్నారని టాక్. ఈ విధంగా.. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ లో మెజారిటీ షేర్ హీరోల పారితోషికం రూపంలోనే ఖర్చవుతోందనేది నిర్మాతల ఆవేదన. అది సినిమా క్వాలిటీపైనా ప్రభావం చూపుతోందనేది వారి ఫిర్యాదు.
* జనం వచ్చేది వాళ్లను చూసేగా..
హై రెమ్యునరేషన్ అంశం తెరపైకి వచ్చినప్పుడు, పోటీగా వచ్చే మరో వాదన ఏమంటే.. "ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేది వాళ్లను చూసే కదా" అని. అలా ప్రేక్షకులు వస్తేనే కదా టికెట్లు తెగేది? కాసుల వర్షం కురిసేది? అని పలువురు వాదిస్తారు. అవును.. ఇందులో సందేహం లేదు. కానీ.. ఇదంతా సినిమా హిట్ అయినప్పుడు. అదే.. సినిమా డిజాస్టర్ గా మిగిలిపోతే..? అన్నదానికి సమాధానం ఉండదు. సినిమా విజయాన్ని, దానికి తగ్గట్టు పారితోషికాన్ని తమ ఖాతాలో వేసుకుంటున్న హీరోలు.. పరాజయానికి ఎలాంటి బాధ్యత తీసుకుంటున్నారు? అనేది సమాధానం లేని ప్రశ్న. ఈ విషయమై పలుమార్లు బయ్యర్లు ఆందోళ చేసిన ఘటనలు.. ఒకరిద్దరు హీరోలు పారితోషికం తిరిగిచ్చిన సంఘటనలు కూడా తెలియనివి కావు.
* కథే కదా హీరో..?
ఎవరు అవునన్నా కాదన్నా.. ఒక సినిమా విజయంలో మొదటి పాత్ర కథదే. హీరో తన స్టార్ డంతో ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పించినా.. రెండున్నర గంటలపాటు కుర్చీలో కూర్చోబెట్టేది మాత్రం కథ, దాన్ని నడిపించిన విధానమే. ఇవి రెండూ సక్సెస్ అయినప్పుడు.. హీరో తన పాపులారిటీతో అగ్నికి వాయువు తోడైనట్టుగా సినిమా ఘనవిజయం సాధించడానికి కారకుడవుతాడు. దీనికి ఎవరైనా మినహాయింపు అంటే.. వారు నటించిన సినిమాలన్నీ విజయాలు సాధించాలి. కానీ.. అలా ఎప్పటికీ జరగదు. కాబట్టి, కథే హీరో అన్న విషయాన్ని అందరూ గుర్తెరగాలి.
* కరోనా కాలం..
సాధారణ సమయంలోనే తెలుగు సినిమా సక్సెస్ రేట్ సగటున 2 నుంచి 3 శాతంగా నమోదవుతోంది. బడ్జెట్ బాహుబలి కొండలా అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ.. విజయాల శాతం మాత్రం పెరగడం లేదు. ఫలితంగా ఇండస్ట్రీ నష్టాల బాటలోనే పయనిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన కరోనా.. అన్ని రంగాలనూ అతలా కుతలం చేసింది. ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసింది. సినిమా ఇండస్ట్రీపైనా దీని ప్రభావం తీవ్రంగానే పడింది. ఎక్కడికక్కడ షూటింగులు నిల్చిపోయాయి. దీంతో.. చిత్రపరిశ్రమపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో పడ్డాయి. నిర్మాతలు కోట్లాది రూపాయలు వడ్డీలకు తెచ్చి పెట్టిన సినిమాలు మధ్యలో ఉన్నాయి. పూర్తైనవి కూడా స్టోర్ రూముల్లో మూలుగుతున్నాయి. ఇలాంటి దుస్థితిలో థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు తెరుచుకుంటాయో..? తెరుచుకున్నా.. ప్రేక్షకులు గతంలో మాదిరిగా వస్తారో లేదో తెలియని పరిస్థితి. ఈ సమస్యలన్నీ పూర్తిగా క్లియర్ అయ్యి.. ప్రశాంతంగా బొమ్మ ఎప్పుడు పడుతుందో ఎవ్వరూ చెప్పలేకున్నారు.
* దిగిరావల్సిందే..
ఇలాంటి పరిస్థితుల్లో.. హీరోలు రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకోవాల్సిన అవసరమైతే చాలా ఉంది. అది, నిర్మాతలకు ఊరటనివ్వడమే కాకుండా.. సినీ కార్మికులకు పరోక్షంగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఈ చర్చ కరోనా మొదలైన కానుంచీ జరుగుతూనే ఉంది. మరి, ఆచరణలో ఎంత మేర అమలవుతోందన్నదే ప్రశ్న. మరి.. ఈ విషయంలో మెట్టు దిగేదెవ్వరు.. బెట్టు చేసేదెవ్వరన్నది చూడాలి.