పార్టీకి వెళితే ఎలా ఉండాలి? ఓవైపు కోవిడ్ భయాలు వెంటాడుతున్నా మరోవైపు పార్టీల పేరుతో తందనాలాడటం సరైనదేనా? పైగా మాస్క్ లేకుండా.. శానిటైజ్ చేయకుండా ఇష్టానుసారం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే పరిణామం ఎలా ఉంటుంది? వీటన్నిటికీ సదరు బడా పారిశ్రామిక వేత్త 2022 NYE పార్టీ జవాబుగా నిలుస్తోందని గుసగుస వినిపిస్తోంది.
ఉన్నట్టుండి పరిశ్రమ అగ్ర హీరోలు సహా పలువురు నటీమణులు.. ఓ సంగీత దర్శకుడు కూడా తమకు కోవిడ్ సోకిందని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. వీరంతా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కరోనా సోకిందని చెప్పడం అందరిలోనూ అనేక సందేహాలకు దారితీసింది. సదరు సెలబ్రిటీలంతా పార్టీ లైఫ్ ని ఆస్వాధించేవారే. కానీ అనూహ్యంగా ఉన్నట్టుండి ఓమిక్రాన్ వైరస్ ఎలా సంక్రమించింది? అంటూ ఆరాలు సాగుతున్నాయి. నిజానికి కోవిడ్ సోకిన వారంతా హైదరాబాద్ నగర శివార్లలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త రహస్యంగా నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకకు హాజరయ్యారని గుసగుస వైరల్ అవుతోంది. పార్టీలో ఎవరూ మాస్క్ పెట్టుకోలేదు. కనీస శానిటైజేషన్ తో జాగ్రత్తలు పాటించలేదు. ఇష్టానుసారం ఎంజాయ్ చేశారు! అందుకే ఇప్పుడు ఊహించని విధంగా ముప్పు వాటిల్లింది. దీంతో సదరు సెలబ్రిటీల్ని కలిసిన వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఎవరికి ఏ క్షణం ఏ ముప్పు బయటపడుతుందోనని టెన్షన్ పడుతున్నారట. ఇప్పుడు కోవిడ్ కాంట్రాక్ట్ గురించి ప్రతి ఒక్కరూ సెర్చ్ మూడ్ లో ఉన్నారు. రెండు డోస్ లతో టీకాలు వేసినందున వారు ప్రాథమిక శానిటైజేషన్ విషయాన్ని కూడా పాటించకపోవడం ముప్పుగా మారిందని పార్టీకెళ్లిన వారిలో కొందరు గుసగుసగా లీకులందించారు.
అయినా ఎన్ని డోస్ లు వేసినా కానీ కొత్త లక్షణాలతో వైరస్ ఎటాక్ చేస్తూనే ఉంది. దీనికి ఇప్పట్లో అంతం లేదు. అందువల్ల కనీస ప్రమాణాలతో జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎంతగా పార్టీలో కిక్కు ఎక్కినా కానీ మాస్క్ నియమాన్ని .. శానిటైజర్ వాడాలన్న జ్ఞానాన్ని మరువకూడదని అంటున్నారు. మాస్క్ తీయాల్సి వస్తే కాస్త జన సమూహాలకు జనాలకు జరగాలని కూడా సూచిస్తున్నారు. అయితే పార్టీలో ఇలాంటివి సాధ్యం కాదు కాబట్టి వాటికి వెళ్లకపోవడమే ఉత్తమమని కూడా ఒక సెక్షన్ సూచిస్తోంది.