చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌ని చూసి స్టార్స్ నేర్చుకోవాల్సిందేనా?

Update: 2022-11-01 08:31 GMT
క‌రోనా త‌రువాత ప‌రిస్థితుల‌న్నీ ఒక్క‌సారిగా మారిపోయాయి. ప్రేక్ష‌కుల అభిరుచి లోనూ విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో ప్రేక్ష‌కులు ఏ స్టార్ హీరో సినిమా విడుద‌లైనా థియేట‌ర్ల‌కు ఎగ‌బ‌డి పోయే వారు కానీ ఇప్ప‌డు మాత్రం అలా జ‌ర‌గ‌డం లేదు. ఏ స్టార్ హీరో సినిమా విడుద‌లైనా ఆలోచించి టాక్ బాగుంద‌ని తెలిస్తేనే థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. లేదంటే అదే సినిమా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేంత వ‌ర‌కు ఎదురుచూస్తున్నారు.

ఓటీటీల‌తో పాటు కంటెంట్ ప్ర‌ధానంగా సాగే సినిమాలకే అధిక ప్రాధాన్య‌త నిస్తున్నారు. దీంతో ప్ర‌తీ స్టార్ హీరో నుంచి అప్ క‌మింగ్ హీరోల వ‌ర‌కు ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి నానా పాట్లు ప‌డుతున్నారు. ఇక స్టార్ హీరోల గురించి అయితే చెప్పాల్సిన ప‌ని లేదు. గ‌తంలో ప్ర‌మోష‌న్స్ కి పెద్ద‌గా రాని వారు కూడా ఈ మ‌ధ్య ప్ర‌మోష‌న్స్ లో చురుగ్గా పాల్గొంటూ ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

'RRR' టైమ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం యావ‌త్ దేశం మొత్తం ప‌ర్య‌టించి ప్ర‌మోట్ చేసిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ లో పాపుల‌ర్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛాన‌ల్స్ కి కూడా ఈ ఇద్ద‌రు స్టార్స్ ఇంట‌ర్వ్యూలు ఇవ్వడం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అంతగా ఈ మూవీ ప్ర‌యోష‌న్స్ కోసం ఈ ఇద్ద‌రు స్టార్స్ ప్రాణం పెట్టారు. ఆ స్థాయిలో మేక‌ర్స్ నుంచి భారీ మొత్తాన్ని సొంతం చేసుకున్నారు కూడా. కానీ కొంత మంది  స్టార్స్ మాత్రం ఇప్ప‌టికీ సినిమా ప్ర‌మోష‌న్స్ కి ముఖం చాటేస్తుండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

త‌మిళ స్టార్ హీరో అజిత్ సినిమా ప్ర‌మోష‌న్స్ కి దూరంగా వుంటున్నారు. ఓటింగ్ టైమ్ లో సామాన్యుడిగా లైన్ లో నిల‌బ‌డి ఓట్లు వేసే స‌ద‌రు హీరో సినిమాకు కోట్ల‌ల్లో పారితోషికం తీసుకుంటూ ప్ర‌మోష‌న్స్ కి దూరంగా వుండ‌టం ఇండ‌స్ట్రీలో త‌ప్పుడు సంకేతాల్ని అందిస్తోంద‌ని ప‌లువురు కామెంట్ లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో అజిత్ 'తునీవు' మూవీలో న‌టిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు త్వ‌ర‌లో ప్రారంభం కానున్నాయి. అయితే అజిత్ మాత్రం ఎలాంటి ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌డం లేద‌ట‌.

కార‌ణం ఏంటని అడిగితే అజిత్ పీఆర్ టీమ్ ఇచ్చిన స‌మాధానం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు నెటిజ‌న్స్ ని షాక్ కు గురిచేస్తోంది. మంచి సినిమా త‌న‌ని తానే ప్ర‌మోట్ చేసుకుంటుంద‌ట‌. దానికి ప్ర‌త్యేకంగా ప్ర‌మోష‌న్స్ చేయ‌డం అవ‌స‌రం లేద‌ని అజిత్ చెప్పిన‌ట్టుగా ఆయ‌న పీఆర్ టీమ్ వెట్టించిన తీరు ప‌ట్ల విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి హీరోని పెట్టి వంద కోట్లతో సినిమాలు నిర్మిస్తున్నారు.

అవి ఫ్లాప్ అయిన‌ప్పుడు వారి ప‌రిస్థితి ఏంట‌ని, హీరో ప్ర‌మోట్ చేస్తే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వ‌స్తాయ‌ని త‌ద్వారా కొంత మేర‌కైనా డిస్ట్రిబ్యూట‌ర్స్ బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం వుంటుంద‌ని, అది కూడా చేయ‌క‌పోతే ప‌రిస్థితి మ‌రి దారుణంగా మారుతుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు వాపోతున్నాయ‌ట‌. అంటే స్టార్ హీరోల్లో చాలా మంది రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌ని చూసి నేర్చుకోవాల‌ని మ‌న వాళ్లు కామెంట్ లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News