బాలీవుడ్ సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి తెలిసిందే. విలాసవంతమైన విల్లాల్లో సకల సౌకర్యాలతో తమకు నచ్చిన విధంగా జీవిస్తారు. అయితే దానికోసం ఇంటిని అవసరమైన విధంగా డిజైన్ చేసుకునేందుకు కోట్లలో వెచ్చించాల్సి ఉంటుంది. దానికోసం ప్రోఫెషనల్ డిజైనర్స్ ని వెతికి పట్టుకోవాలి.
కానీ కింగ్ ఖాన్ కి ఆ అవసరం లేకపోవడానికి కారణం తన భార్య గౌరీనే డిజైనర్ కావడం.. తాజాగా షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ ముంబైలోని ట్రంప్ టవర్ లోని ఆమె డిజైన్ చేసిన స్టేజ్ అపార్ట్ మెంట్ తలుపులను ఓ వీడియోలో చూపించారు. తన కొత్త ఇంటి ఇంటీరియర్ డిజైన్లను.. విలాసవంతమైన నివాసాన్ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసారు. దీనికి సంబంధించి గౌరీఖాన్ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
``సంపన్నమైన డిజైన్ లు ఎంత చూసినా తనివి తీరనంతగా ఉంటాయి. ట్రంప్ టవర్స్ లో లోధా గ్రూప్ ఇండియాతో నా డిజైనర్ సహకారాల్లో ఇదొకటి. నివాసం లగ్జరీ..ప్రత్యేకత..గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది` అని రాసుకొచ్చారు. గత ఏడాది గౌరీ ఖాన్ తన సహకారం గురించి చెబుతూ.. నివాసం స్నిప్పెట్ లను పోస్ట్ లో పంచుకున్నారు. ``బంగారు- లేత గోధుమరంగు గల సొగసైన అపార్ట్ మెంట్ కి క్లాసిక్ డిజైన్స్.. సమకాలిన శైలి గురించి వివరించారు. అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్ ని..పచ్చదనాన్ని కృత్రిమంగా ఏర్పాటు చేసారు.
ఈ అందమైన లగ్జీరీ హౌస్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. రణబీర్ కపూర్..సిద్ధార్థ్ మల్హోత్రా సహా అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీ కోసం విలాసవంతమైన స్పేస్ ని కూడా కేటాయించారు. అతిధుల్ని హాల్లో కూర్చోబెట్టడం దగ్గర నుంచి అల్పాహారం ఏర్పాట్లు వరకూ చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు. ఇక షారుక్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ కొత్ కార్యాలయాన్ని గౌరీఖాన్ ఎంతో స్టైలింగ్ గా డిజైన్ చేసారు. ఇంటికి దూరంగా ఆఫీస్ ఉంటుంది. స్టోరీ డిస్కషన్స్ కి అనువైన విధంగా.. ఆ కార్యాలయంలోకి అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణం కల్పించారు. ఆఫీస్ డిజైన్ లోనూ ఎంతో క్రియేటివిటీ దాగి ఉంది.