ప్రతిసారీ సంక్రాంతి అంటే ఉత్పన్నమయ్యే సమస్యే ఇది. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు రిలీజవుతుంటే వాటి మధ్య ఇంకేదైనా రిలీజవ్వాలంటే థియేటర్ల సమస్య ఉంటుంది. ఓపెనింగ్ వసూళ్లకు అది చాలా ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. ప్రస్తుత మహమ్మారీ భయాల నడుమ క్రైసిస్ సీజన్ లో 50శాతం ఆక్యుపెన్సీ వల్ల ఇది ఇంకా పెద్ద ముప్పు అన్న విశ్లేషణ సాగుతోంది.
కారణం ఏదైనా మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ రిలీజ్ తేదీ విషయమై ఇంకా డైలమా నెలకొందన్న గుసగుసలు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వినిపిస్తున్నాయి. సంక్రాంతి బరిలో నువ్వా నేనా అంటూ మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ తేదీల్ని ఫిక్స్ చేసుకున్నాయి. వీటిలో మాస్టర్ - రెడ్- అల్లుడు అదుర్స్ ఒకదాని వెంట ఒకటిగా రిలీజవుతున్నాయి. భోగికి అటూ ఇటూ సినిమాలు ఉన్నాయి.
ఇలా వరుస సినిమాల పోటీ నడుమ క్రాక్ ను రిలీజ్ చేయాలా వద్దా? అన్న సందిగ్ధత నెలకొందట. ఒకేసారి గంపగుత్తగా వెయ్యి థియేటర్లు కావాలంటే సోలోగానే రావాలి. అలాంటప్పుడు జనవరి 9 రిలీజ్ ఆప్షన్ ని ఎందుకు పరిశీలించకూడదు అని ఆలోచిస్తున్నారట. అయితే అంత ముందుగా వచ్చేసినా జనాల్లో అంత దూకుడు ఉందా? అన్నదే అసలు పాయింట్. సంక్రాంతికి దగ్గరగా రెండు మూడు రోజులు ఉండేంత కిక్కు జనంలో చాలా ముందే ఉంటుందా? కొత్త అల్లుళ్లు ఇంతకుముందులా అత్తారింట్లో దిగి సందడి చేసే సన్నివేశం తక్కువగానే కనిపిస్తోంది! అన్న విశ్లేషణా సాగుతోంది. ఏదేమైనా ఇంకా తేదీ ఫిక్స్ కాలేదని సమాచారం. రవితేజ- శ్రుతిహాసన్ జంటగా గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. అధికారికంగా రిలీజ్ తేదీ ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.