భారీతనంతో పాటు ఎంచుకున్న కథాంశం.. ఎమోషన్ కనెక్టయితేనే నేటి ఆడియన్స్ థియేటర్ల వరకూ వస్తున్నారు. ఇదివరకటిలా హీరో నచ్చితేనో లేక మూవీలో ఏదో ఒక పాయింట్ నచ్చితే చాలు అనుకోవడానికి లేదు. సినిమాలో సాలిడ్ కంటెంట్ ఉంటేనే చివరివరకూ కుర్చీలకు అంకితమై చూస్తున్నారు. లేదంటే మధ్యలోనే డ్రాప్ అయ్యి సినిమా బాలేదంటూ యూట్యూబ్ చానెళ్లలో స్టేట్ మెంట్లతో బెంబేలెత్తిస్తున్నారు. రిలీజైన తొలిరోజునే రిపోర్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుండడంతో భారీ సినిమాలు తీసేవాళ్లు ఒకటి కి పది ఆలోచించాల్సి వస్తోంది.
ఆ కోవలో పరిశీలిస్తే ప్రభాస్ `సాహో`లో కథ- కంటెంట్ ఎంత? అన్న క్వశ్చన్ రెయిజ్ అవుతోంది. ఇప్పటివరకూ ఈ సినిమా కథ ఇదీ అని రివీల్ కాలేదు. ప్రభాస్ గజదొంగగా కనిపిస్తాడని.. లేదూ సీక్రెట్ ఏజెంట్ గానో లేదా సీక్రెట్ కాప్ పాత్రలోనో కనిపిస్తాడని రకరకాలుగా ఊహాగానాలు సాగుతున్నాయి. టీజర్ చూశాక శ్రద్దా కపూర్ ని కాపాడే స్పెషల్ ఎస్కార్ట్ గా అతడు ఎలాంటి సాహసాలు చేశాడు? అన్న పాయింట్ తో సాహో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని వెల్లడైంది. ఈ కథంతా బాగానే ఉంది.. మేకింగ్ విజువల్స్ సహా టీజర్ సైతం మైమరిపించాయి. సాహో టైటిల్ కి తగ్గట్టే భారీతనం ఆకట్టుకుంటుందనడంలో సందేహమే లేదు. అయితే బాహుబలి తర్వాత వస్తున్న సినిమాగా యాక్షన్ తో పాటు కంటెంట్ లో ఎమోషన్ ని ఏ మేరకు డ్రైవ్ చేస్తుంది? అన్నదే అసలైన పాయింట్.
మరోవైపు బాలీవుడ్ లో ఈ సినిమాకి తీవ్రమైన పోటీ నెలకొంది. సాహో ఆగస్టు 15న రిలీజవుతోంది.. అదేరోజు కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన `మిషన్ మంగళ్`.. జాన్ అబ్రహం నటించిన `బాట్లా హౌస్` చిత్రాలు పోటీపడుతున్నాయి. ఈ రెండు సినిమాలు సాలిడ్ కంటెంట్ తో వస్తున్నవే. మిషన్ మంగళ్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన మంగళ్యాన్ ఉపగ్రహం చుట్టూ హైడ్రామా నేపథ్యంలో సాగే చిత్రం. `బాట్లా హౌస్` దిల్లీ ఉగ్రదాడుల నేపథ్యంలో సాగే చిత్రం. ఇవి రెండూ ఆద్యంతం రక్తి కట్టిస్తాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆ రెండు సినిమాలతో పోలిస్తే కథ పరంగా సాహో పూర్తి విభిన్నమైనది. అయితే ఎవరు ఎంత కమర్షియల్ గా తీశారు? కథాంశంలో ఎమోషన్ ఎంతవరకూ వర్కవుటైంది? అన్నది కీలక పాత్ర వహించనుంది. వాస్తవానికి బాహుబలి స్టార్ సినిమాకి పోటీ వద్దని అనుకున్నా.. కిలాడీ అక్షయ్ కానీ జాన్ అబ్రహాం కానీ ఎక్కడా తగ్గలేదని.. అందుకే అదే తేదీకి రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. వీటిలో ఏ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా ఇతర సినిమాల వసూళ్లను కూడా తమవైపు తిప్పేసుకునే వీలుంటుంది. కథ కంటెంట్ బావున్న సినిమా మాత్రమే లాంగ్ రన్ లో వసూళ్లను అందుకుని సేఫ్ అవుతుంది. ఈ విషయంలో `సాహో` మిగతా వాటితో పోటీపడాల్సి ఉంటుంది. `సాహో` సస్పెన్స్ కి తెర దించేందుకు ఇంకా ఎన్నో రోజులు లేదు. జస్ట్ 42రోజులే ఇంకా..!!