మహర్షి మూవీలో మాటలు రాని పిల్లాడిగా కనిపించి.. అందరి దృష్టిలో పడే క్యారెక్టర్ ఉంది కదా. ఆ పిల్లాడిది హైదరాబాదే. రీల్ లో మాటలు రాని పిల్లాడిగా నటించిన ఇతడి పేరు రామ్ చరణ్. స్క్రీన్ మీద మాత్రం చక్రి టైటిల్ కార్డు పడింది. ఈ చిన్నారికి మహర్షి 47వ మూవీ కావటం విశేషం.
కూకట్ పల్లి కి చెందిన ఈ పిల్లాడు ఇప్పటికే పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో నటించారు. మచ్చుకు చెప్పాల్సి వస్తే.. ప్రభాస్ మిర్చి.. మహానటి.. మహానుభావుడు.. ద్వారక.. గుంటూరోడు.. నేనొక్కడినే.. బ్రహ్మోత్సవం.. మనం.. రోజులు మారాయి.. నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల్లో నటించిన చక్రికి ఇంకో రికార్డు ఉంది.
అదేమంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఛైల్డ్ ఆర్టిస్ట్ గా లైఫ్ టైమ్ మెంబర్ షిప్ అందుకున్న మొట్టమొదటి బాల నటుడు చక్రినే. ప్రస్తుతం మూడో క్లాస్ చదువుతున్న ఈ పిల్లాడు ఇన్ని సినిమాల్లో నటించినా.. మహర్షిలో అతడి పాత్రతో ఒక్కసారిగా ఎలివేట్ అయ్యాడు. కేపీహెచ్ బీలో డిజిటల్ స్టూడియో నిర్వహిస్తున్న ఇతగాడి తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం. వీరంతా సినిమాల్లో నటించటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి.