సినిమా వెనుక సినిమా సంగతులు ఆల్ టైమ్ ఇంట్రె స్టింగ్. తెలుసుకునే కొద్దీ ఆసక్తి రేకెత్తిస్తాయి. మహేష్ నటించిన ఒక్కడు టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ హిట్. అయితే ఆ సినిమా ప్రారంభం వెనక చాలా గమ్మత్తయిన సంగతులే ఉన్నాయి. స్వతహా గుణశేఖర్ కి ఛార్మినార్ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ పాతబస్తీ వెళితే ఛార్మినార్ దగ్గర టీ తాగకుండా వెనక్కి రారు. అలా ఓసారి ఛార్మినార్ వెళ్లినప్పుడు అతడి మనసులోకి బ్రిలియంట్ ఆలోచన వచ్చింది.
ఓ రెండు కుర్ర గ్యాంగ్ లు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటాయి. ఆకతాయిల అల్లరే అల్లరి. అయితే దీనికో హాలీవుడ్ మూవీ ఇన్ స్పిరేషన్ ఉంది. వెస్ట్ సైడ్ స్టోరీ అనేది తన ఫేవరెట్ సినిమా. ఎప్పటికైనా ఇలాంటి సినిమా ఒకటి తీయాలి అనుకున్నారు. అంతే ఆ మెరుపు లాంటి ఆలోచన చుట్టూ కథ అల్లేశారు. కట్ చేస్తే రామోజీరావు నిర్మాత అనుకున్నారు. కథ నచ్చింది చేసేద్దాం అన్నారు. కానీ తర్వాత ఎందుకనో వాయిదా. ఆ తర్వాత సీన్ లోకి ఎమ్మెస్ రాజు వచ్చారు. అశ్వనిదత్ ఆఫీసులో ప్రిన్స్ మహేష్ ఫోటోలు చూడడం ఒకే చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
ప్రిన్స్ మహేష్ స్వయంగా ఎమ్మెస్ రాజుతో ముచ్చటించి ఓకే చేశాడు. ఆ తర్వాత ఛార్మినార్ సెట్ కోసం ఐదెకరాల ఖాళీ స్థలం వెతికారు. ఛార్మినార్ ఎత్తు 176 అడుగులు, దానిపై మినార్ ల ఎత్తు 78 అడుగులు. కథకి కావాల్సింది ఇవే. కాబట్టి కింది వైపు సెట్ అవసరం లేదు. పైన డిజైన్ చేయించారు. అయితే చుట్టూ భారీ రోడ్ సన్నివేశం తీయడం కోసం ఏం చేయాలి ? అనుకున్నప్పుడు గ్రాఫిక్స్ లో మాయాజాలం చేయాలనుకున్నారు. దేవీ పుత్రుడు లాంటి ఫ్లాప్ ని నిర్మించిన ఎమ్మెస్ రాజు, మృగరాజు లాంటి ఫ్లాప్ తీసిన దర్శకుడు కలయిక.. అంటూ జనం నవ్వుకున్నారు. కానీ ఒక్కడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అందరి నోళ్లు మూయించింది. అంత కథ ఉందన్నమాట!