పాటల రచయితల్లో మనకు సిరివెన్నెల, వేటూరి వంటి మహానుభావులు ఎంత ఫేమస్సో.. తమిళంలో వైరముత్తు అంత ఫేమస్సు. ఎన్నో అద్భుతమైన పాటలు రాశారాయన. అపరిచితుడు సినిమాలో 'ఓ సుకుమారి' సాంగ్ నుండి.. అనేక పాటలు రాసి.. నాలుగుసార్లు నేషనల్ అవార్డు, ఓ నాలుగు ఫిలింఫేర్లు, లెక్కలేనని తమిళనాడు స్టేట్ అవార్డులు అందుకొని.. మొన్ననే పద్మబూషణ్ కూడా తీసుకున్నారు. అంతటి మహానుభావుడైన వైరముత్తు కుమారుడే బాహుబలి తమిళ వెర్షన్ మాటల రచయిత మదన్ కార్కీ. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళదాం..
అసలు విషయం ఏంటంటే.. మొన్ననే ప్రకాష్ రాజ్ తన కొత్త డైరక్టోరియల్ వెంచర్ కోసం మదన్‌ను లిరిక్స్ రాయమని అడిగాడు. అయితే సడన్‌గా ఇక్కడో ట్విస్ట్. అసలు మదన్ ఈ సినిమాకు పనిచేస్తే తాను సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయనంటూ లెజండరీ ఇళయారాజా గారు ప్రకాష్‌రాజ్‌కు వార్నింగ్ ఇచ్చారట. అదేంటబ్బా అనుకుంటున్నారా.. గతంలో ఇళయరాజా-వైరముత్తు కలసి ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు. ఆ పాటల క్రెడిట్స్ విషయంలో గొడవలొచ్చి ఇద్దరూ విడిపోయారు. ఆ గొడవ పర్యావసానమే ఇప్పుడు ఇలా రాజాసాబ్ పంతానికి కారణం. ఇక వైరముత్తు కొడుకుతో కూడా ఇళయరాజా పనిచేయను అంటున్నాడంటే ఆ పంతం ఏ రేంజులో ఉందో చూడండి.