ట్రిపుల్ ఆర్ క‌థకు 'రాజ‌న్న‌'కు ఉన్న సంబంధం ఏంటీ?

Update: 2022-03-30 02:30 GMT
సినిమాల ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో చాలా అవేర్ నెస్ పెరిగింది. ఏ సినిమా వ‌చ్చినా అది కాపీనా ఒరిజిన‌ల్ స్టోరీనా అని ట‌క్కున చెప్పేస్తున్నారు. రిఫ‌రెన్స్ ల‌తో స‌హా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకెస్తున్నారు. పాట‌ల్లోనూ కాపీ లిరిక్స్ కానీ, సంగీతం కానీ వినిపించిందా? ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. సీన్ ల విష‌యంలోనూ ఇదే పంథాని అనుస‌రించి నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఈ సీన్ ఈ మూవీ నుంచి లేపేశార‌ని అనుమానం వ‌చ్చినా రిఫ‌రెన్స్ ల‌తో మ‌రీ దుమ్ము దులిపేస్తున్నారు.

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రాల‌కు ఈ త‌ర‌హా ట్రోలింగ్ `విక్ర‌మార్కుడు` నుంచి మొద‌లైంది. `పోలీస్ లాక‌ప్`లోని మెయిన్ ప్లాట్ ని లేపేసి ఈ మూవీ చేశారంటూ అప్ప‌ట్లో ఓ రేంజ్ లో ఆడుకున్నారు. మ‌గ‌ధీర‌, బాహుబ‌లి విష‌యాల్లోనూ ఇదే త‌ర‌హా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు జ‌క్క‌న్న. అయితే తాజాగా ఆయ‌న తెర‌కెక్కించిన పాన్ ఇండియా మూవీపై కూడా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల‌తో తొలి సారి చేసిన చిత్రం `ట్రిపుల్ ఆర్‌`.

దాదాపు మూడున్న‌రేళ్లుగా ఎదురుచూసిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మార్చి 25న అత్యంత భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సినిమా ప్రారంభంలో ది స్టోరీ అంటూ అదిలాబాద్ ఫారెస్ట్ లో మ‌ల్లీ అనే పాప క‌థ‌తో సినిమాని ప్రారంభించాడు రాజ‌మౌళి. మల్లీ న‌చ్చ‌డంతో త‌న‌ని బానిస‌గా తీసుకెళ‌దామ‌నంటుంది  గ‌వ‌ర్న‌ర్ స్కాట్ వైఫ్ కేథ‌రిన్‌. త‌న కోసం గ‌వ‌ర్న‌ర్ స్కాట్ అదిలాబాద్ అడ‌వుల నుంచి మ‌ల్లిని త‌మ వెంట ఢిల్లీకి తీసుకెళ‌తారు. ఆ పాపని విడిపించాల‌ని కొమురం భీం త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి డిల్లీలో మ‌కాం వేసి అవ‌కాశం కోసం ఎదురుచూస్తూ వుంటాడు.

అయితే ఈ క‌థ అచ్చు `రాజ‌న్న‌` క‌థ నుంచి లిఫ్ట్ చేసిన‌ట్టుగా వుందని అంటున్నారు. `రాజ‌న్న‌` క‌థ కూడా మ‌ల్ల‌మ్మ అనే ఓ పాప చుట్టూ తిరుగుతుంది. దొర‌సాని నుంచి త‌న గ్రామాన్ని కాపాడు కోవ‌డం కోసం మ‌ల్ల‌మ్మ‌ను ప్రెసిడెంట్ ని క‌ల‌వాల‌ని కాలి న‌డ‌క‌న ఢిల్లీకి వెళుతుంది. రాజ‌న్న క‌థ మ‌ల్ల‌మ్మ కోసం మ‌ల్ల‌మ్మ చుట్టూ సాగితే.. ట్రిపుల్ ఆర్ మ‌ల్లిని విడిపించ‌డం కోసం సాగింది. ఈ క్ర‌మంలో అడిష‌న‌ల్ గా చ‌ర‌ణ్ క‌థ‌ని ఈ క‌థ‌కు యాడ్ చేసిన‌ట్టుగా వుంది.  

పాట‌తో రాజ‌న్న జ‌నాల్లో చైత‌న్యాన్ని నింపితే కొమ‌రం భీం అదే పాట‌తో జ‌నంలో ఉత్తేజాన్ని క‌గిలించిన తీరు క‌నిపించింది. ఇందుకు సాక్ష్యంగా `కొమ‌రం భీముడో.. కొమురం భీముడో.. సాంగ్ నిలిచింది. ఈ పాట అనంత‌రం అక్క‌డ గుమి గూడిన వేలాది జ‌నం గ‌వ‌ర్న‌ర్ బంగ్లాతో పాటు అక్క‌డున్న పోలీస్ సిబ్బందిపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి దిగ‌డం.. రాజ‌న్న లో నాగార్జున డ‌ప్పు కొట్టి ద‌రువేస్తూ.. ఊపిరి జెండా ఎగ‌రెయ్ చావుకు ఎదురుగ అడుగెయ్ వెయ్య‌ర‌వెయ్.. అంటూ సాగే పాట‌లో జ‌నం ఉత్తేజితులై భీభ‌త్సం సృష్టించిన తీరుని గుర్తు చేసింది. ఇలా ప్ర‌ధాన క‌థ, కీల‌క ఘ‌ట్టాన్ని అటు ఇటుగా మార్చి `రాజ‌న్న‌` నుంచి లిఫ్ట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోందిని సోష‌ల్ మీడియాలో ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News