స్త్రీ - 2 తో సంచ‌ల‌నానికి రెడీ అయిన హీరోయిన్!

Update: 2022-11-01 00:30 GMT
బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో అమ‌ర్ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'స్త్రీ  'అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. క‌మెడీ హార‌ర్ లో శ్ర‌ద్దా కపూర్ పాత్ర ఆద్యంతం ఆక‌ట్టుకుంది. న‌టిగా శ్ర‌ద్దా క‌పూర్ ని మ‌రో మెట్టు పైకెక్కించిన చిత్ర‌మ‌ది.  క‌మ‌ర్శియ‌ల్ గా సినిమా భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. 18 కోట్ల‌తో నిర్మించిన చిత్రం 180 కోట్ల‌కు పైగా వ‌సూళ్లను సాధించింది.

తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా స్త్రీ -2ని కూడా తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్ద‌మ‌వుతుంది. శ్ర‌ధ్దా కూర్ లీడ్ రోల్ లో పార్ట్ -2ని కూడా ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తొలి భాగంలో న‌టించిన రాజ్ కుమార్ రావు పాత్ర‌లో  వ‌రుణ్ ధావ‌న్ న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం శ్ర‌ద్దా క‌పూర్ చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉంది.

ఇప్ప‌టికే బేధియా షూటింగ్ పూర్తి చేసింది. ప్ర‌స్తుతం ఆ సినిమా ప్ర‌చారం ప‌నుల్లో బిజీగా ఉంది. అలాగే  ల‌వ్ రంజ‌న్ ద‌ర్శ‌క‌త్వ‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్ కి జోడీగా న‌టిస్తోంది. ఈ రెండు సినిమాల అనంత‌రం స్త్రీ -2 ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. తొలి భాగానికి దర్శ‌క‌త్వం వ‌హించిన అమ‌ర్ కౌశ్ క్ నే తెర‌కెక్కించ‌నున్నారు.

ఇందులో శ్ర‌ద్దా క‌పూర్ పాత్రి మ‌రింత శ‌క్తివంతంగా మ‌లుస్తున్నారుట‌. హార‌ర్ స‌న్నివేశాల్ని మ‌రింత ఆస‌క్తిక‌రంగా మ‌లిచనున్నార‌ని తెలుస్తోంది. బాలీవుడ్ లో హార‌ర్ సినిమాలు కూడా బాగా త‌గ్గాయి. బ‌యోపిక్ లు..థ్రిల్ల‌ర్ చిత్రాలు ట్రెండ్ కొన‌సాగ‌డంతో మేక‌ర్స్ కొన్నేళ్ల‌గా హార‌ర్ ని ట‌చ్ చేయలేదు. ఒకే జోన‌ర్ లో ముందుకెళ్తున్నారు.

ఈ నేప‌థ్యంలో 'స్త్రీ -2' పై ప్రేక్ష‌కాభిమ‌నుల్లో ఆస‌క్తి నెల‌కొంది. అలాగే ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ లో హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ మ‌ళ్లీ ఊపందుకుంటున్నాయి.  బాలీవుడ్ స‌క్సెస్ రేట్ తగ్గిన నేప‌థ్యంలో మ‌ళ్లీ ఈ సినిమాలు ఇండస్ర్టీని గాడిలో పెట్టాల్సి ఉంది. అలాగే  అలాగే రీమేక్ క‌థ‌ల‌కు బాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. ఒక‌ప్పుడు సౌత్ ఇండ‌స్ర్టీ బాలీవుడ్ వైపు చూసేది. ఇప్పుడు స‌న్నివేశం తారుమారైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News