ఆ సినిమాలకు ఫిట్టింగ్ పెట్టేసినట్లే

Update: 2017-12-08 17:12 GMT
ప్రస్తుతం మన హీరోల సినిమాలు పరబాష ఇండస్ట్రీలో ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటున్నాయో తెలియదు గాని పరబాష సినిమాలు మాత్రం టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. దాదాపు ఇక్కడి స్టార్ హీరోలతో సమానంగా కోలీవుడ్ హీరోలు వారి సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అంతే కాకుండా మంచి ఓపెనింగ్స్ ని కూడా అందుకుంటున్నారు. ఆ సినిమాల ప్రభావం ఇక్కడ కొన్ని సినిమాలపై చాలానే పడుతోంది.

ముఖ్యంగా పండుగలకు పరబాష సినిమాలు డబ్ అవుతూ.. మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. దీంతో తెలుగు సినిమాలు నష్టపోతున్నాయని గత కొంత కాలంగా టీ టౌన్ నిర్మాతలు చాలా ఆరోపిస్తున్నారు. అందుకే ఇప్పుడు కరక్టు ఫిట్టింగ్ పెట్టేశారని అనుకుంటున్నారు. అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా.. ఇక నుంచి ఉండకూడదని తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ డబ్ సినిమాలపై పండగలప్పుడు నిషేధం విధించాలని డిసైడ్ అయ్యింది. తెలుగువారు గ్రాండ్ గా జరుపుకునే దసరా - సంక్రాంతి పండగలప్పుడు కాకుండా మిగతా సమయాల్లో ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు అనే రూల్ ని తీసుకురానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తెలుగు ఫిల్మ్‌ చాంబర్ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో అందరు ఈ విషయంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కాని ఇంకా అధికారికంగా ఏ విషయం తెలియజేయలేదు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని టాక్. అంతే కాకుండా తెలుగు సినిమాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుండటంతో డిజిటల్‌ ప్రసారాల రేట్లను కూడా కొంత వరకు తగ్గిస్తే మంచిదని లేకుంటే మార్చి 1 నుంచి సినిమాలను నిలిపివేయాలని కమిటీ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News