సన్నిలియోన్ కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా పాప్ ఆల్బమ్స్ తో బిజీ అయిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ వీయోలతోనే వరల్డ్ వైడ్ పాపులారిటీ కోసం ప్రయత్నిస్తోంది. తాజాగా సన్నిలియోన్ కనికా కపూర్ పాడిన పాటలో హాట్ అటం బాంబ్ లా చెలరేగిపోయింది. బుధవారమే ఈపాటని రిలీజ్ చేసారు. అయితే ఈ పాట ఇలా రిలీజ్ అయిందో లేదో వెంటనే వివాదం ముసురుకుంది. సోషల్ మీడియాలో నెటిజనులు పాటపై...సన్నిలియోన్ పెర్పార్మెన్స్ పై దుమ్మెత్తిపోయడం మొదలు పెట్టారు. ఇంతగా పాటలో అంతటి వివాదం ఏముందో తెలియాలంటే? అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.
ప్రత్యేక గీతంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సాహిత్యం ఉందని.. అలాగే సన్నిలియోన్ బోల్డ్ పెర్పార్మెన్స్ మరింత కించపరిచేలా ఉందని నెటిజనులు భగ్గుమంటున్నారు. `రాధ నర్తకి కాదు..భక్తురాలు... మధుబన్ పవిత్ర ప్రదేశం. రాధ మధుబన్ లో ఇలా డ్యాన్స్ చేయలేదు. ఇది సిగ్గుపడే సాహిత్యం. సాహిత్యం విలువలే దిగజార్చేలా ఉంది పాట!! అని నెటిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడిని కించపరిచే హక్కు నీకు లేదు అంటూ మరోక వినియోగదారుడు అగ్రహం వ్యక్తం చేసాడు. హిందూ సంప్రదాయాలు..విలువలు మరింత దిగజరాపోయేలా సినిమా వాళ్లు వ్యవహరిస్తున్నారని...నీతులు తెరపై చెప్పడం సరికాదని.. చెప్పినవి చూపూవి మంచిగా ఆచరణలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజలు ఇచ్చే డబ్బుతోనే మీరు విలాసాలు అనుభవిస్తున్నారు? అన్న సంగతిని మర్చిపోవద్దని గుర్తు చేసారు. పాటలని వెంటనే తొలగించి బహిరంగంగా క్షమాపణలు కోరాలని లేకపోతే నిర్ణయాలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పాట విడుదలై 24 గంటలకు కాక ముందే ఇంతగా కాక పుట్టించిందంటేనే అర్థం చేసుకోవాలి. హిందూ సంఘాలకి...ఆర్.ఎస్.ఎస్ వాళ్ల కంట పడిందంటే? ఇంకెంతగా రచ్చ జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరాది ప్రజలు హిందువుల పరంగా దేవతల ను కించపరిచేలా వివాదాస్పద అంశాలు ఉన్నాయంటే? ప్రశ్నించడంలో ముందుంటారు. మధుబన్ పాటని షరీబ్ తోషి స్వరపరించారు. సన్నిలియోన్ ట్విటర్లో షేర్ చేసారు.