అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్లో 20వ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తుండగా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ చిత్ర విషయంలో సుకుమార్ అల్లు అర్జున్ లు ఇప్పుడప్పుడే రిలాక్స్ అయ్యేలా కనబడటం లేదు. గతేడాది షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి మొదటి నుండి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ప్రస్తుతం కరోనా సృష్టిస్తున్న విజృంభన కారణంగా సినిమా ఇండస్ట్రీ లాక్ అవుట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ విదేశాల్లో షూటింగ్స్ జరుపుకుంటున్న అన్నీ చిత్రాలు వాటిని రద్దు రద్దు చేసుకున్నాయి. అన్ని సినిమాలతో పాటే ఈ చిత్ర షూటింగ్ కూడా రద్దు చేసుకుంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా 21 రోజులు అవుట్ ప్రకటించడంతో ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు కరోనా చూస్తుంటే ఈ లాక్ డౌన్ 21 రోజులతో ఆగేలా లేదు. మహేష్ బాబుతో సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొనిబి సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేసాడు. సుకుమార్ ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి కూడా చాలా సమయం తీసుకున్నాడు. ఎట్టకేలకు ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ అల్లు అర్జున్ మేక్ ఓవర్ కోసం కొన్ని రోజులు నిలిపేశారు. ఈ చిత్రంలో లారీ డ్రైవరు పాత్ర పోషించనున్న బన్నీ గుబురు గడ్డంతో కనిపించనున్నాడు.
అంతేకాకుండా ఈ చిత్రంలో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నారు. దీని కోసం అల్లు వారి అబ్బాయి స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. చిత్తూరు మాండలీకాన్ని పర్ఫెక్ట్ గా పలకడానికి ప్రత్యేకంగా ముగ్గురు ట్యూటర్లను కూడా నియమించుకున్నాడు. ఈ విషయం అప్పట్లో వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులను చూస్తే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవడానికి చాలా టైం పడుతుందని, ఈ టైంలో అల్లు అర్జున్ చిత్తూరు మాండలీకం మీద పట్టు కోల్పేయే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తోందట. దీని కోసం మరో రెండు నెలలు తెలుగు యాస కోసం ట్యూషన్ కి వెళ్ళబోతున్నట్లు సమాచారం. ఈ రెండు నెలల కాలం తర్వాత పరిస్థితిని బట్టి షూటింగ్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.