'జాతిరత్నాల'ను ప్రశంసించిన స్టైలిష్ స్టార్..!

Update: 2021-03-12 08:30 GMT
టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొత్త టాలెంట్, కొత్త యాక్టర్లను ప్రోత్సహించే హీరోలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. కొత్తవాళ్లకు అల్లు అర్జున్ తన అభిప్రాయాలు తెలిపి దర్శకనిర్మాతలకు ఉత్సాహం పెంచుతుంటాడు. ఇలా స్టార్ హీరోలు ప్రోత్సాహం అందిస్తే ముందుముందు న్యూ కమర్స్ మరింత మెరుగైన సినిమాలు తీయడానికి ఆస్కారం ఉంటుంది. శివరాత్రి సందర్బంగా కామెడీ ఎంటర్టైనర్ జాతిరత్నాలు సినిమా విడుదలైంది. ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ జాతిరత్నాలు హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందాన్ని అభినందించాడు. ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్.. "నేను గతరాత్రి జాతిరత్నాలు మూవీ చూశాను. ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసి నేనింతగా నవ్వలేదు" అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే హీరో నవీన్ పోలిశెట్టి, డైరెక్టర్ అనుదీప్, ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలతో పాటు మొత్తం జాతిరత్నాలు టీమ్ ను ప్రశంసించాడు. నవీన్ పొలిశెట్టి యాక్టింగ్ ఇరగ్గొట్టాడని అన్నాడు బన్నీ. నిన్ననే విడుదలైన జాతిరత్నాలు భారీ అంచనాల మధ్య భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. అలాగే సినిమాలో ప్రముఖంగా భాగమైన నాగ్ అశ్విన్, దర్శకుడు అనుదీప్ అందరి కోసం కూడా స్పెషల్ గా మెన్షన్ చేసి తన స్పెషల్ కంగ్రాట్స్ తెలిపాడు బన్నీ. అంతేగాక కొసమెరుపుగా 'లాస్ట్ లో బ్రెయిన్ ఆఫ్ చేసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి' అంటూ సూచించడం విశేషం. ఇదిలా ఉండగా..  అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్పతో సిద్ధం అవుతున్నాడు. ఆగష్టు 13న సినిమా థియేటర్లో సందడి చేయనుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Tags:    

Similar News