కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇప్పుడు ఈడీ ఎదుట విచారణ ఎదుర్కొంటుందంటే కారణం బీజేపీ సీనియర్ నేత ‘సుబ్రహ్మణ్య స్వామి’ కోర్టులో వేసిన పిటీషన్లే. ఇప్పటికే ఆమెను ముప్పుతిప్పలు పెట్టిన ఈ పెద్దమనిసి దేశంలోని చాలా మంది ప్రముఖులపై కోర్టులకు ఎక్కుతూ ఇబ్బంది పెడుతుంటాడు. తాజాగా బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ పై పడ్డాడు.
బాలీవుడ్ లో ప్రతి ఏడాది అత్యధిక సినిమాలు చేసే నటుడిగా అక్షయ్ కుమార్ కు పేరుంది. సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తుంటాడు. చివరగా అతడి నుంచి వచ్చిన చిత్రం ‘సామ్రాట్ ఫృథ్వీరాజ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. అయినప్పటికీ అక్కీ తన జోష్ ను తగ్గించడం లేదు. వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేతు’ సినిమా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామ్ సేతును ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బీజేపీ లీడర్, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ మేకర్స్ కు వ్యతిరేకంగా పిటీషన్ వేశారు.
ఈ చిత్రంలో రామ్ సేతును తప్పుగా చూపించే అవకాశం ఉందని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. నిజాలను తారుమారు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. కేంద్రప్రభుత్వం రామ్ సేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి పిటీషన్ వేయబోతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రామ్ సేతు సినిమాపై పిల్ వేశాడు స్వామి.
రామ్ సేతు సినిమాకు అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నుస్రత్ బరుచా హీరోయిన్స్ గా నటించారు. అరుణ్ భాటియా , విక్రమ్ మల్హోత్రా కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.