అదేంటోనండీ.. ఏదైనా ఒక్క సినిమాకు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా.. ఎక్కడో ఒకటో అరా తప్పిస్తే.. పెద్దగా ఏవీ పూర్తి స్థాయిలో వసూలు చేయలేకపోతున్నాయి. మొన్నామధ్య సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న టెంపర్-సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలకు చివర్లో కొన్ని ఏరియాలకు చిన్నపాటి నష్టాలు తప్పలేదు. టాకేమో సూపర్ హిట్.. ఆఖరిలో రెవెన్యూలు చూస్తే ఓ రెండు మూడు కోట్లు ఆం ఫట్.. అలా ఉంది పరిస్థితి.
ఇప్పుడు మెగా మూవీ 'సుబ్రమణ్యం ఫర్‌సేల్' కూడా సేమ్ టు సేమ్ ఇదే పందాలో జాయిన్ అయిపోయింది. సెప్టెంబర్ ఆఖరిలో రిలీజైన ఈ సినిమాకు ఎబోవ్ యావరేజ్ నుండి హిట్ టాక్ వచ్చింది. దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత దిల్ రాజు, హీరో హీరోయిన్.. ఇలా అందరూ సూపర్ హ్యాపీ. కాకపోతే ఓవర్ సీస్ లో మాత్రం సినిమా అనుకున్నంత ఆడేలేదు. ఏదో సో సో గా నడిచిందంతే. కట్ చేస్తే.. ఓ 30 రోజుల్లో దాదాపు సినిమా సత్తా నీరసించేసింది. అక్కడక్కడా ఆడిస్తున్న చిన్నాచితకా ధియేటర్లకు కేడా సుబ్రమణ్యానికి బాయ్ చేప్పేశాయ్. మరి వసూళ్ళ మాటేమిటి? అన్ని చోట్లా కలుపుకొని సినిమా 18.32 కోట్లు వసూలు చేసింది.
అంటే సాయిదరమ్ స్టామినాకు ఇది చాలా ఎక్కువే. అప్పుడే మనోడు ఒక రామ్ - గోపిచంద్.. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక రవితేజ రేంజులో వసూలు చేశాడు. కాకపోతే సినిమాను పంపిణీదారులందరూ కలసి 20 కోట్లు షుమారు వెచ్చించి సినిమాను కొన్నట్లు తెలుస్తోంది. అంటే చిన్నపాటి దెబ్బలు తప్పలేదనమాట.