సుబ్రమణ్యం ధమాకా అదిరిపోయింది. సుబ్రమణ్యం టిక్కెట్టు అమ్మకాలు ఇరగదీశాయి. మొదటి రోజు సుబ్రమణ్యం ఫర్ సేల్ 4.08 కోట్లు వసూలు చేసింది. కేవలం ఏపి - తెలంగాణలో వచ్చిన వసూళ్లు ఇవి. సాయిధరమ్ నటించిన మూడు సినిమాల కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది. సుబ్రమణ్యం జోరు చూస్తుంటే మొదటి వారమే బ్రేక్ ఈవెన్ సాధించేయడం ఖాయం అని అర్థమవుతోంది.
ఎట్టకేలకు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో సాయిధరమ్ రేసులో దూసుకుపోతున్నాడు. నిన్నటి రోజున బక్రీద్ సెలవు. శనివారం - ఆదివారం సాఫ్ట్ వేర్ జనాలకు సెలవులు. సండే పబ్లిక్ హాలీడే. పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ మూడ్రోజుల్లోనే సుబ్రమణ్యం బడ్జెట్ అంతా రికవరీ అయిపోతుందని లెక్కలేస్తున్నారు. మనకు తెలుస్తున్న అధికారిక లెక్కల ప్రకారం ఈస్ట్ గోదావరి పంపిణీ హక్కులు 1 కోటి 25 లక్షలు చెల్లించారట. మొదటి రోజే 41 లక్షలు వసూలైంది. రెండో రోజు 35 లక్షలు మినిమం వసూలయ్యే ఛాన్సుందని చెబుతున్నారు. అంటే ఆ లెక్కన మొదటి మూడు రోజుల్లోనే అక్కడ సేఫ్. మిగతా ఏరియాల్లోనూ సేమ్ రిజల్ట్. దీన్నిబట్టి మొత్తానికి సుబ్రమణ్యం ఈ దసరా పండుగను ఓ రేంజులో సెలబ్రేట్ చేసుకుంటున్నట్టే.
దసరా రాకముందే విజయం అందుకున్న హీరోగా పండగ చేసుకుంటున్నట్టే.