సేల్ కాస్త కష్టమే అక్కడ..

Update: 2015-09-25 13:30 GMT
సుబ్రమణ్యం ఫర్ సేల్ ని ఓవర్సీస్ మార్కెట్ లోనూ మంచి రేట్ కే అమ్మారు. కోటి రూపాయలకు రైట్స్ కొన్నాడు దిల్ రాజు. కానీ ప్రీమియర్ షోల ద్వారా సుబ్రమణ్యం కలెక్ట్ చేసింది 8700 డాలర్లు మాత్రమే. దిల్ రాజుకి మంచి మార్కెట్ ఉంది యూఎస్ లో. అయితే.. సుప్రీం హీరోగా ప్రమోషన్ పొందిన సాయిధరం తేజ్ కి ఇక్కడ పెద్ద మార్కెట్ ఎక్స్ పెక్ట్ చేయడం అంత సరైన విషయం కాదు. ఎంత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేసినా.. రిజల్ట్ మాత్రం అంత ఆశాజనకంగా లేదు.

అయితే ప్రీమియర్ షోలతోనే రిజల్ట్ చెప్పేయడం సరికాదు కానీ.. భారీ రేటుకు కొన్న రాజు.. మంచి కలెక్షన్స్ ఆశిస్తాడు. ఇక్కడి మార్కెట్లో డైరెక్టర్ హరీష్ శంకర్ కి కూడా క్రేజ్ అంతగా లేదు. దీనికి తోడు.. మొత్తం గ్రాస్ 60శాతం ఖర్చులకే వెళ్లిపోతుంది ఇక్కడ. అందుకే ఈ మార్కెట్ లో సక్సెస్ అవడం అంత సులభం కాదు. వీకెండ్స్ లో కాకుండా ఒక రోజు ముందే రిలీజ్ చేయడం కూడా కలెక్షన్స్ పై బాగానే ఎఫెక్ట్ చూపించింది. ఒకవేళ వీకెండ్స్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం.. నష్టాలు తప్పకపోవచ్చు.

టాక్ వరకూ బాగానే ఉంది కాబట్టి.. వీకెండ్స్ కి ఆడియన్స్ వస్తారనే అంచాలున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పర్వాలేదనిపించేలా ఉన్నాయంటున్నాడు దిల్ రాజు. అమెరికాలోనే సగం సినిమాని తీయడం కూడా కొంత పాజిటివ్ అయ్యే ఛాన్సుంది. ఏమైనా ఇక్కడ మార్కెట్ ని సుబ్రమణ్యం ఏ మాత్రం పట్టుకోగలడో తెలియాలంటే..  ఆదివారం వరకూ ఆగాల్సిందే.
Tags:    

Similar News