మెగా కుర్రాడు ఇరగదీశాడు

Update: 2015-09-26 09:49 GMT
రెండు రోజుల్లో రూ.6.3 కోట్ల షేర్.. సాయిధరమ్ తేజ్ లాంటి అప్ కమింగ్ హీరోకు ఇది కచ్చితంగా పెద్ద ఫిగరే. సాయి స్టార్ అయిపోతున్నాడనడానికి ఈ వసూళ్లే నిదర్శనం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ రూ.6.3 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మామూలుగా రామ్ లాంటి మీడియం రేంజి స్టార్ల సినిమాలకే ఈ స్థాయిలో కలెక్షన్ లు వస్తాయి తొలి రోజు సుబ్రమణ్యం ఫర్ సేల్ కు రూ.3.6 కోట్ల షేర్ వచ్చింది. రెండో రోజు కూడా వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. రూ.2.7 కోట్ల దాకా షేర్ వసూలైంది.

గురు - శుక్రవారాల్లో కలిపి నైజాంలో రూ.2.4 కోట్లు - సీడెడ్ లో రూ.1.08 కోట్లు - ఉత్తరాంధ్రలో రూ.55 లక్షలు - గుంటూరులో రూ.62 లక్షలు - తూర్పుగోదావరిలో రూ.62 లక్షలు - పశ్చిమ గోదావరిలో రూ.39 లక్షలు - కృష్ణాలో రూ.39 లక్షలు - నెల్లూరులో రూ.25 లక్షలు షేర్ కలెక్టయింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపితే షేర్ రూ.6.3 కోట్లుగా తేలింది. గ్రాస్ రూ.8 కోట్ల దాకా ఉంది.

ఓవర్సీస్ - కర్ణాటక కూడా కలుపుకుంటే షేర్ రూ.7 కోట్ల దాకా ఉండొచ్చు. శని - ఆదివారాలు కూడా కలెక్షన్ లు స్టడీగా ఉంటాయి కాబట్టి నాలుగు రోజుల ఫస్ట్ వీకెండ్ లో సినిమా రూ.12-13 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసే అవకాశముంది. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ బిజినెస్ దాదాపు రూ.20 కోట్ల దాకా జరిగింది. ఆ మేరకు కలెక్ట్ చేస్తే సినిమా హిట్టయినట్లు లెక్క. ప్రస్తుతం జోరు చూస్తుంటే రూ.20 కోట్ల మార్కు అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ సినిమా మీద దిల్ రాజు రూ.10 కోట్లకు అటు ఇటుగా బడ్జెట్ పెట్టినట్లు సమాచారం.
Tags:    

Similar News