'కేజీఎఫ్' సంచలన విజయం తరువాత కన్నడ సినిమాలు దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత విడుదలైన కన్నడ సినిమాల్లో రక్షిత్ శెట్టి నటించిన 'చార్లీ 777, కిచ్చా సుదీప్ 'విక్రాంత్ రోణ' వంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగేలా చేశాయి. తాజాగా విడుదలైన 'కాంతార' ఇప్పడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది.
పక్కా కన్నడ నేటివిటీతో దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి నటించి రూపొందించిన ఈ మూవీ కన్నడ నాట చర్చనీయాంశంగా మారింది. గత శనివారం తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 'కేజీఎఫ్' మేకర్స్ హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారుతోంది. దీనిపై ప్రముఖ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ లు చేస్తున్నారు.
ప్రభాస్ ఇప్పటికే స్పందించగా, అనుష్క కూడా తనదైన స్టైల్లో 'కాంతార'పై ప్రశంసల వర్సం కురిపించింది. చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిజేసింది. ఇదిలా వుంటే ఈ మూవీపై రామ్ గోపాల్ వర్మ కూడా తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిచారు. సినిమా వాళ్లపై తనదైన స్టైల్లో పంచ్ లు వేశారు. అగ్రతారలు, సూపర్ స్టార్స్, భారీ నిర్మాణ విలువలు, వీఎఫ్ ఎక్స్ మాత్రమే మాత్రమే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తారని ఫిక్స్ అయిన సినిమా వాళ్ల నిర్ణయం తప్పని 'కాంతార' నిరూపించిందన్నారు.
సూపర్ స్టార్స్, భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన వీఎఫ్ ఎక్స్ వంటివే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తాయని సినిమా వాళ్లందరూ ఓ నిర్ణయానికి వచ్చిన వేళ ఎలాంటి అగ్రతారాగణం లేకుండా తెరకెక్కిన చిన్న చిత్రం 'కాంతారా' భారీ చిత్రాల రికార్డ్స్ ని బ్రేక్ చేసింది' అని వెల్లడించారు.
రూ. 16 కోట్ల బడ్జెట్ తో పెద్దగా పరిచయం లేని ఆర్టిస్ట్ లతో ఈ మూవీని హోంబలే ఫిలింస్ నిర్మించింది. అలాంటి ఈ మూవీ ఐఎండీబీ రేటింగ్స్ లో RRR, 'కేజీఎఫ్ 2' వంటి చిత్రాలను బీట్ చేసింది. 'కాంతార' ఐఎండీబీ రేటింగ్స్ లో9.5 ని రేటింగ్ ని సొంతం చేసుకోవడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.