#సుచిలీక్స్ బిజినెస్ మళ్లీ మొదలైందా?

Update: 2018-01-25 05:18 GMT
గత ఏడాది చలికాలం ఎండింగ్ లో కోలీవుడ్ లో ఉన్న కొందరి తారలకు చెమటలు పట్టించిన సుచి లీక్స్ ఏ స్థాయిలో హల్చల్ చేశాయో అందరికి తెలిసిందే. ఆ ఏడాది సమ్మర్ వరకు కోలీవుడ్ లోని కొందరు సినీ స్టార్స్ బయటకి వెళ్లలేదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపించలేదు. సింగర్ సుచిత్ర అనే నేమ్ తో ఉన్న ట్విట్టర్ ఎకౌంట్ నుంచి కొందరి సినీ ప్రముఖుల రాసలీలలు బయటపడటంతో దేశమంతా షాక్ అయ్యింది.

అయితే సుచి లీక్స్ ఘటన ఫస్ట్ అనివర్సరీ అని అంటూ మరో ఎకౌంట్ నుంచి కొన్ని లీకేజీలు వస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ వార్త తెలుసుకున్న చాలా మంది కుర్రకారు సుచి లీక్స్ కోసం మళ్లీ ట్విట్టర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అయితే సుచిత్ర కార్తీ అని ఉన్న ఒక ట్విట్టర్ ఎకౌంట్ నుంచి మరో ఇద్దరి స్టార్ హీరోయిన్స్ న్యూడ్ వీడియోస్ బయటపడ్డాయి. అయితే అవి హీరోయిన్స్ క్లిప్స్ అని ఇంకా నిర్ధారణ కాలేదు.

బాత్రూమ్ లో స్నానం చేస్తూ సెల్ఫీ దిగినట్లు ఉన్న ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో మోసపూరితంగా కొన్ని కోట్లవరకు బిజినెస్ జరిగిందని టాక్ కూడా వచ్చింది. సినీ స్టార్స్ వీడియోలు బయటపడకూడని డబ్బు చెల్లించినట్లు మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. ఇక ప్రస్తుతం వస్తోన్న వీడియోల వల్ల కూడా బ్లాక్ మెయిల్ తో డబ్బు గుంజడానికి ఏమైనా ప్లాన్స్ జరుగుతాయా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.   
Tags:    

Similar News