రీల్ జీవితాలకు రియల్ జీవితాలకు అస్సలు పొంతన ఉండనట్లుగా ఉంటుంది. కొన్ని ఉదంతాలు విన్నప్పుడు రీల్ జీవితాల్లో ముడిపడి ఉన్న నటీనటుల జీవితాలు.. రీల్ మాదిరే రోటీన్ కు భిన్నంగా కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఒక సిత్రమైన నిజాన్ని వెల్లడించిన షాకిచ్చింది సీనియర్ నటి. దాదాపు ముప్ఫై ఏళ్ల క్రితం మలయాళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది సుచిత్రా కృష్ణమూర్తి.
మలయాళం.. తమిళం.. హిందీ చిత్రాల్లో నటించిన ఆమె.. షారుక్ లాంటి అగ్రనటులతోనూ పని చేసి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ ను వివాహం చేసుకున్నప్పటికీ.. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత భర్తతో వేరు పడింది.
ప్రస్తుతం 46 ఏళ్ల వయసులో ఉన్న ఆమె.. ఇటీవల విడుదలైన భూల్ భులయా 2.. గిల్టీ మైండ్స్ వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె సర్ ప్రైజ్ అనిపించే అంశాల్ని పంచుకుంది.
తన కుమార్తె తనను డేటింగ్ చేయాలని బలవంతం పెట్టిందన్న ఆమె.. ఒక డేటింగ్ వెబ్ సైట్ లో తన ప్రొఫైల్ ను పోస్టు చేసినట్లు చెప్పారు. తానెంత చెప్పినప్పటికి వినకుండా ఒక డేటింగ్ వెబ్ సైట్ లో తన ప్రొఫైల్ ను అప్ లోడ్ చేసినట్లు చెప్పారు. శేఖర్ కపూర్ తో వైవాహిక జీవితానికి గుర్తుగా ఆమెకు కావేరి కపూర్ అనే కుమార్తె ఉంది.
తన కుమార్తె బలవంతం కారణంగా తాను ఎవరికి తెలియని వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని.. ఆ తర్వాత అతనితోనూ విడిపోయినట్లుగా చెప్పారు. తానిప్పుడు ఉన్నది డేటింగ్ చేసేందుకు కాదని.. తన కుమార్తెకు అర్థమయ్యేలా చెప్పినట్లుగా వివరించారు.
తర్వాతి కాలంలో తనకు అసభ్యకరమైన మెసేజ్ లు రావటంతో డేటింగ్ సైట్ నుంచి తన ప్రొఫైల్ ను తొలగించినట్లుగా ఆమె చెప్పిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేసేలా మారాయి. రీల్ సీన్ మాదిరి ఉన్న ఈ రియల్ సీన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.