ఎంకిని టాలీవుడ్ పిలుస్తోందా?

Update: 2019-05-31 09:15 GMT
ఎంకి పాట.. ఆర్పీ నోట‌! అంటూ కొంత గ్యాప్ త‌ర్వాత ఆర్పీ ప‌ట్నాయ‌క్ చేస్తున్న ప్ర‌య‌త్నం తెలిసిందే. ఇటీవ‌లే ఈ ఆల్బ‌మ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ని ఆవిష్క‌రించారు. అందులో ఎంకి లుక్ .. నాయుడు మామ లుక్ ఆక‌ట్టుకున్నాయి. ప‌ల్లె ప‌ట్టు జాన‌ప‌దాల్ని చ‌క్క‌గా విజువ‌లైజ్ చేసి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌మని తెలిపారు. ఆ క్ర‌మంలోనే ఈ ప్ర‌య‌త్నం బావుంద‌ని ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఇక ఎంకి పాట‌కు ఆర్పీ ఆయ‌న సోద‌రుడు న‌వీన్ ప‌ట్నాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎంకి క‌థ‌ల క‌ర్త‌ నండూరి సుబ్బారావు ఈ పాట‌ల్ని ర‌చించారు.

బ్రోక‌ర్ సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నా .. తుల‌సీ ద‌ళంతో ఫ్లాప్ అందుకున్న త‌ర్వాత ఆర్పీ కెరియ‌ర్ కి గ్యాప్ త‌ప్ప‌లేదు. ప్ర‌స్తుతం ఎంకి పాట ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కూ స‌ఫ‌లం అవుతుంది? అన్న‌ది అటుంచితే ఈ ఆల్బ‌మ్ పేరుతో ఓ కొత్త‌మ్మాయి తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానుంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ఎంకి పాట‌లో ఎంకి ఎవ‌రు? అంటూ ఇప్ప‌టికే మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆరాలు తీస్తున్నార‌ట‌.

ఎంకి పాత్ర ధారి పేరు అంత‌షీలా ఘోష్‌. ఈ భామ ప‌క్కా మోడ్ర‌న్ గాళ్. బెంగాళీ మోడ‌ల్ అని తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలోనూ ఈ అమ్మ‌డు పాపుల‌ర్. అంత‌షీలా సోష‌ల్ మీడియాలో ఫ‌క్తు అర్బ‌న్ గాళ్ లుక్ తో అద‌ర‌గొట్టేస్తోంది. ఎంకి పాట ఆల్బ‌మ్ లో అందుకు పూర్తి భిన్నంగా అచ్చ తెలుగు అమ్మాయిలాగా.. ప‌ల్లె ప‌ట్టు సుంద‌రిగా మైమ‌రిపిస్తోంది. విలేజ్ గాళ్ లుక్ లోనూ అద్భుతంగా ఒదిగిపోయింది. తాజాగా ఎంకి పాట ఆల్బ‌మ్ నుంచి రివీల్ చేసిన గుండె గొంతుకలోనే పాట‌లో అంత‌షీలా ఎక్స్ ప్రెష‌న్స్ యూత్ గుండెల్ని ట‌చ్ చేస్తున్నాయి. అందుకే ఈ అమ్మ‌డు తొంద‌ర్లోనే టాలీవుడ్ లో అవ‌కాశం అందుకుంటుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. ఇక గుండె గొంతుక‌లోన పాట చిత్రీక‌ర‌ణ‌కు ఎంచుకున్న క్యారికేచ‌ర్స్ .. బ్యాక్ గ్రౌండ్ లొకేష‌న్స్ ఫెంటాస్టిక్. ఇక ట్యూన్ రొటీన్ గానే ఉన్నా.. ఆర్పీ టోన్ ఆక‌ట్టుకుంది. బెంగాళీ గాళ్స్ అన‌గానే క‌మ‌లినీ ముఖ‌ర్జీ- రిచా గంగోపాధ్యాయ లాంటి నాయిక‌లు గుర్తుకొస్తారు. వారి బాట‌లోనే అంత‌షీలా ఘోష్ కి ఛాన్సుంటుందేమో చూడాలి.

   
Full View


Tags:    

Similar News