'ఆంధ్రా అందగాడు' మూవీతో దర్శకురాలిగా కెరీర్ ప్రారంభించిన సుధా కొంగర 'ఇరుధి సుట్రు' మూవీతో మంచి పేరు తెచ్చుకుంది. అయితే సూర్య హీరోగా నటించి నిర్మించిన 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలో జాతీయ స్థాయిలో పలు పురస్కారాల్ని దక్కించుకోవడమే కాకుండా దర్శకురాలిగా ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న సుధా కొంగర ప్రస్తుతం ఇదే మూవీని హిందీలో అక్షయ్ కుమార్ తో రీమేక్ చేస్తోంది.
హీరో సూర్య కీలక అతిథి పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత సుదా కొంగర మరో బయోపిక్ కు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా ఏయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్. గోపీనాథ్ జీవిత కథ స్ఫూర్తితో 'ఆకాశమే నీ హద్దురా' మూవీని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న సుధా కొంగర ఈ సారి దేశంలోనే ప్రముఖంగా వినిపించే రతన్ టాటా జీవిత కథని తెరపైకి తీసుకురానున్నారట.
గత కొంత కాలంగా రతన్ టాటా జీవితంపై రీసెర్చ్ చేస్తున్న సుధా కొంగర ఈ కథని తెరపై ఆవిష్కరించడానికి ప్రస్తుతం భారీ స్థాయిలో ప్లాన్ లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో రతన్ టాటా ది ప్రత్యేక స్థానం. టాటా మోటర్స్ తో పాటు అనేక రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. అయితే ఎయిర్ లైన్స్ రంగంలో ప్రవేశించాలని విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఎట్టకేలకు ఇన్నేళ్ల తరువాత ఎయిర్ లైన్స్ ని చేజిక్కించుకున్నారు.
ఆయన జీవితం, వ్యాపార సామ్రాజ్యం, వేల కోట్ల దానాలు, సేవా కార్యక్రమాలపై సమగ్రంగా ఈ బయోపిక్ ని తెరపై సుధా కొంగర ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నారట. ఈ బయోపిక్ లో హీరో సూర్య లేదా, బాలీవుడ్ హీరో అభిషుక్ బచ్చన్ కానీ నటించే అవకాశం వుందని తెలుస్తోంది. రతన్ టాటా స్ఫూర్తి వంతమైన జీవితాన్ని నేటి యువతకు తెలియజెప్పాలనే ఆలోచనలో భాగంగానే రతన్ టాటా బయోపిక్ ని సుధా కొంగర తెరపైకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని అధికారికంగా సుధా కొంగర వెల్లడించే అవకాశం వుందని తెలిసింది. వెంకటేష్ తో 'ఇరుధి సుట్రు'ని 'గురు' గా రీమేక్ చేసిన సుధా కొంగర ఆ సినిమాకు ముందే దేశంలో ప్రముఖంగా నిలిచిన పలువురు వ్యక్తుల జీవిత కథలపై వర్క్ చేయడం, రీసెర్చ్ చేయడం మొదలు పెట్టిందట. ఇప్పడు వాటిని ఒక్కొక్కటిగా తెరపైకి తీసుకురావడం మొదలు పెట్టిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.