ఒకప్పుడు ఈయన టైమింగ్ మార్కు పంచులు లేని సినిమా ఉండేదే కాదు. 'బయ్యో' 'పితుహు' అంటూ ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్లు రచ్చరచ్చగా ఉండేవి. ఆయనే సుధాకర్. విలన్ గా కంటే కమెడియన్ గా ఆయన సూపర్ పాపులర్. కాన దురదృష్టవశాత్తూ ఆయనకు ఆఫర్లు దూరమవ్వడం.. తరువాత ఆయనకు బ్రెయిన్ స్ర్టోక్ వచ్చి కోమాలోకి జారుకోవడం.. వగైరా జరిగిన తరువాత.. ఆయన సినిమాల్లో మూడో లైఫ్ పొందాలని చూస్తున్నారు.
80లలో విలన్ గా అలరించిన సుధాకర్.. 90లు వచ్చేసరికి కమెడియన్ గా మారిపోయారు. పెద్దరికం నుండి హిట్లర్ వరకు.. రాజా సినిమా నుండి పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా వరకు.. ఆయన చాలా సినిమాల్లో చాలా బాగానే అలరించారు. చేసింది చిన్న పాత్రే అయినా కూడా.. అది అందరికీ బాగా గుర్తుండిపోయేంది. చాన్నాళ్ళ గ్యాప్ తరువాత తయన సాయిరాం శంకర్ హీరోగా రూపొందుతున్న ''వాడు కాదు వీడు'' సినిమాలో హీరోకు మావయ్య పాత్రలో నటిస్తున్నారు సుధాకర్. ఈ సినిమా ఆయన్ను బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టు చేస్తుందో లేకపోతే బిజీ కమెడియన్ ను చేస్తుందో తెలియదు కాని.. సుధాకర్ మాత్రం థర్డ్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటున్నారు.
ఇకపోతే ఇలాంటి స్టార్ కమెడియన్లు మళ్లీ రైజింగులోకి వస్తే ఆ కిక్కే డిఫరెంటుగా ఉంటుంది. చూద్దాం మనోళ్ళు ఛాన్సులు ఇస్తరో లేదో!!