అప్పుడే తోపు వేషాలు ఎందుకు బాబూ

Update: 2017-06-11 07:44 GMT
చాలామంది యంగ్ హీరోలది ఒకటే ఆశ. వారు పంచ్ విసిరితే వేలకు వేలు మంది విజిల్స్ వేశేయాలి. వారు విలన్ ని కొడితే జనాలు ఎగిరెగిరి ఎంజాయ్ చేయాలి. ఒక పవన్ కళ్యాణ్‌.. ఒక మహేష్‌ బాబు.. ఒక అల్లు అర్జున్ తరహాలో మాస్ ను ఆకట్టుకోవాలి. ఇదే టార్గెట్. అయితే ఆ టార్గెట్ ను చేరుకోవడానికి ఒక దారి ఒక పద్దతి ఉంటుంది. ఆ పద్దతిని ఫాలో అవ్వకుండా రెండో సినిమాకే పెద్ద 'మాస్' స్టార్ అయిపోదాం అంటే మాత్రం.. జనాలు హ్యాండిస్తారు.

అదిగో ఆ మధ్యన మాస్ సినిమాతో అదరగొట్టాలని తనీష్‌.. రాజ్ తరుణ్‌.. తరువాతేమో నాగ శౌర్య.. చాలా ప్రయత్నాలే చేశారు. కాని అవన్నీ ఆడలేదు. కథ బాగున్నా.. కథనంలో కొత్తదనం ఉన్నా కూడా.. ఎందుకో హీరోలు ఆ పాత్రలకు నప్పలేదనే అందరి ఫీలింగ్. ఇంకా అంతగా మాస్ ఎప్పీల్ లేని హీరోలు.. 100 మంది మధ్యలో చాలామంది రౌడీలను ఎత్తెత్తి కొడుతుంటే జనాలకు నమ్మబుద్ది కాలేదు. ఇప్పుడు ఇదే తరహాలో సుధాకర్ కొమకుల అనే మరో హీరో కూడా నువ్వు తోపు రా అనే సినిమాతో వస్తున్నాడు. చేజులూ ఫైట్లూ పంచ్ డైలాగులూ.. వామ్మో మాస్ హిస్టీరియా అంతే మెయిన్టయిన్ చేశాడు. అయితే ఇదంతా ధియేటర్లలో ఎంతమందికి కనక్ట్ అవుతుంది అనేదే పెద్ద విషయం. లవ్ స్టోరీలు తీసే ఇటువంటి సాఫ్ట్ హీరోలను .. సడన్ గా మాస్ గా ఒప్పుకుంటారా?

ఇప్పటివరకు అయితే ఈ తోపు వేషాలు వర్కవుట్ కాలేదు. మరి నిజానికి సుధాకర్ కూడా కాస్త టైమ్ తీసుకుని ఈ తోపు వేషాలు వేసుంటే బాగుండేది అనే ది చాలామంది అభిప్రాయం. ఒకవేళ వర్కవుట్ అయితే మాత్రం.. టాలీవుడ్ కు ఒక తెలంగాణ బేస్డ్ మాస్ హీరో దొరికినట్లే. లెటజ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News