హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా తెలుగు సినిమాపై సుధాకర్ వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఏకంగా 400 సినిమాలు పూర్తి చేసిన ఘనుడు సుధాకర్. 90ల చివర్లో కమెడియన్‌గా ఏడాదికి పాతిక సినిమాల దాకా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సుధాకర్.. ఉన్నట్లుండి స్లో అయిపోయాడు. గత పదేళ్లుగా తెలుగు సినిమాల్లో సుధాకర్ జాడే లేదు. సుధాకర్ చివరగా కనిపించిన చెప్పుకోదగ్గ సినిమా అంటే.. 'సంక్రాంతి'. ఆ తర్వాత కనుమరుగైపోయాడు. తాగుడుకు బానిసైపోయాడని.. మద్యం చుక్క పడకుంటే నిలవలేడని.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని.. ఇలా సుధాకర్ గురించి రకరకాల వార్తలొచ్చాయి. ఐతే ఇప్పుడు సడెన్‌గా సుధాకర్ మళ్లీ తెరమీదికి వచ్చాడు. సాయిరాం శంకర్ హీరోగా నటిస్తున్న ' ' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు సుధాకర్.
ఈ సడెన్ రీఎంట్రీ గురించి.. పదేళ్లుగా సినిమాలకు దూరమైపోవడం గురించి సుధాకర్‌ను కదిలిస్తే.. ''నా ఆరోగ్యం గురించి రకరకాల వార్తలొచ్చాయి. నేను మద్యానికి బానిసనైపోయానని చెప్పుకున్నారు. ఐతే నేను మరీ అంత పెద్ద తాగుబోతును కాను. షూటింగ్‌ల నుంచి వచ్చాక రిలాక్స్ అవ్వడానికి కొంచెం తాగగేవాణ్నంతే. నేను యోగా చేస్తాను. నేను వేసే ఆసనాలు చాలామంది వల్ల కావు. అనారోగ్య సమస్యల వల్లే సినిమాలకు దూరమయ్యా. ఐతే యోగా వల్లే మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతుడినయ్యాను. అనుకోకుండా సాయిరాం శంకర్‌తో నటించే అవకాశం వచ్చింది. ఇకపై వరుసగా సినిమాలు చేయాలని అనుకుంటున్నా'' అన్నాడు సుధాకర్.