మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో హిట్లర్ ఓ సెన్సేషన్ మాత్రమే కాదు.. చిరును మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా ఇది. నాలుగేళ్లలో పది సినిమాలు రిలీజ్ అయినా.. సరైన హిట్ లేక మెగాస్టార్ ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో 14 నెలల గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన సినిమా ఇది. ఈ మూవీ విషయంలో చిరు ఎన్నేసి జాగ్రత్తలు తీసుకున్నారో.. ఇప్పుడు మెగాస్టార్ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన సుధాకర్ బయటపెట్టాడు.
మలయాళ మూవీ హిట్లర్ కి తెలుగు రీమేక్ గా తెలుగులో అదే పేరుపై రూపొందగా.. మమ్ముట్టి రోల్ ని మెగాస్టార్ చేశారు. అయితే.. ఒరిజినల్ ని ఒకటికి రెండు సార్లు టీమ్ సభ్యులకు చూపించిన చిరు.. అలానే చేస్తే చాలని చెప్పారట. తాను మాత్రం ఒరిజినల్ ని చూడకుండానే చేశానన్నాడు సుధాకర్. అంతే కాదు.. ఈ మూవీకి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించినా.. ప్రతీ షాట్ చిత్రీకరణ తర్వాత మెగాస్టార్ జాగ్రత్తగా చూసుకునేవారట. ఏదైనా మార్పులు చేయాలన్నా సరే సూచించేవారట. సీన్ పర్ఫెక్షన్ కోసం చిరు ఎంత కష్టపడ్డారో చెప్పుకొచ్చాడు సుధాకర్. అన్ని సినిమాలు చేసిన చిరంజీవికి.. ఏ సన్నివేశం ఎలా ఉంటే పండుతుందో.. ముఖ్యంగా తన ఫ్యాన్స్ తనను ఎలా చూసేందుకు ఇష్టపడతారో చూసుకోవడం.. దాని ప్రకారం సీన్స్ వచ్చేలా చూసుకోవడం పెద్ద విషయమేమీ కాదు.
చిరుకు అప్తమిత్రుల్లో ఒకరైన సుధాకర్ చెప్పాడంటే.. ఇందులో ఒక్క అక్షరం కూడా అవాస్తవం ఉండే ఛాన్స్ లేదు. దీని ప్రకారం అర్ధం అయ్యేదేంటంటే.. హిట్లర్ చిత్రానికి ఆల్మోస్ట్ తానే డైరెక్ట్ చేసేశారు. ఇంతకీ ఇప్పుడు అసలు డౌట్ ఏంటంటే.. ఇప్పుడు 150 సంగతి కూడా ఇంతేనా? అసలే ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న వివి వినాయక్ ఉన్నా తనే డైరెక్ట్ చేసేసుకుంటారా? ఇది కూడా రీమేక్ కాబట్టి చేసేసినా చేసేయచ్చు కానీ.. అవన్నీ మనమేం చెప్పగలం.. ఇప్పుడు సుధాకర్ లాగా.. తర్వాత మళ్లీ ఎవరైనా బైటపెడితే అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి.