నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కొత్త సినిమా 'వి'. టాలెంటెడ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నివేద థామస్, అతిథి రావు హైదరిలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఉగాదికే విడుదల కావాల్సిన సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. దేశం మొత్తం థియేటర్లు మూసివేయడంతో కొత్త సినిమాలన్నీ మూలన పడ్డాయి. థియేటర్లు తిరిగి ఓపెన్ అయితే గాని విడుదలయ్యేలా కన్పించడం లేదు. ఇక లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఓటిటిలే ఎంటర్టైన్మెంట్ కోసం పెద్ద దిక్కులా మారాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దొరికిన సినిమాలన్నింటిని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ బేరం కుదుర్చుకొని ఓటిటిలో ప్రదర్శిస్తున్నాయి.
అలా ఓటిటిల బేరం వరకు వెళ్లి థియేటర్లోనే విడుదల అవుతానంటున్న సినిమా వి. ఈ సినిమా మేకింగ్ అప్పుడే చాలా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ట్రైలర్ విడుదలయ్యాక ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక సమ్మోహనం సినిమా తర్వాత మరోసారి ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో నటిస్తున్నాడు సుధీర్ బాబు. తాజాగా వి సినిమా విడుదల గురించి మాట్లాడుతూ.. 'వి సినిమా నిజానికి మొదట్లో ఓటిటి ప్లాట్ ఫామ్ పై రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ అలా కాదని ఫస్ట్ హాఫ్ మాత్రమే ఓటిటిలో రిలీజ్ చేసి సెకండ్ హాఫ్ థియేటర్లో రిలీజ్ చేయాలనీ అనుకున్నాం. అలా చేస్తే ప్రేక్షకులకు సస్పెన్స్ తో దిమ్మతిరిగిపోద్ది అని.. ఇంకోటి సెకండ్ హాఫ్ రిలీజ్ చేయడానికి థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియట్లేదు. అందుకోసమే మళ్లీ ఆలోచించి డైరెక్ట్ థియేటర్లోనే థ్రిల్ చేయాలని నిర్ణయించుకున్నాం..' అని సుధీర్ తెలిపారు. తుపాకీ మీడియా తరపున టాలెంటెడ్ యాక్టర్ సుధీర్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు..