గ్రామీణ నేపథ్యంలో కథలను ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు కరుణ కుమార్ సిద్ధహస్తుడు. 'పలాస 1978' సినిమా అందుకు పెద్ద ఉదాహరణ. అలాంటి ఆయన దర్శకత్వంలో 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా రూపొందింది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధీర్ బాబు - ఆనంది నాయకా నాయికలుగా నటించారు. నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. వేరే షూటింగు ఉండటం వలన, ఆనంది హాజరు కాలేకపోయిందని చెప్పారు. ఈ వేదికపై సుధీర్ బాబు మాట్లాడాడు.
"ముందుగా చిరంజీవిగారికి థ్యాంక్స్ చెప్పాలి .. అడిగిన వెంటనే 'మందులోడా' సాంగ్ ను రిలీజ్ చేశారు. 'సమ్మోహనం' సినిమా ప్రమోషన్స్ చిరంజీవిగారితో మొదలుపెట్టగా మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చిరంజీవిగారితోనే స్టార్ట్ చేశాము. అలాగే డార్లింగ్ ప్రభాస్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఇంటికి వెళితే మంచి భోజనం పెట్టారు. మంచితనంతో .. మర్యాదలతో చంపేస్తారు ఆయన. ఇక మా సూపర్ స్టార్ బావ .. ట్రైలర్ రిలీజ్ చేశాడు. థ్యాంక్స్ చెప్పి నేను ఆయనను దూరం చేసుకోలేను.
'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాకి టీజర్ నచ్చో .. ట్రైలర్ నచ్చో మీరు సినిమాకి రావొచ్చు. సినిమా చూసి మీరు ఇంటికి వెళ్లేటప్పుడు మీకు సూరిబాబు - శ్రీదేవి మాత్రమే గుర్తుంటారు. ఈ ఇద్దరి కోసమే మీరు మళ్లీ మళ్లీ సినిమాలకు వస్తారు .. ఆ నమ్మకం నాకు ఉంది. నేను మణిగారి పాటలు వింటూ పెరిగాను. అలాంటి ఆయన నా సినిమాకి వర్క్ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. ఈ సినిమాకి ఆయన ఎంత గొప్ప బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారనేది మీరు సినిమాలో చూస్తారు.
కరుణకుమార్ గారు చాలా బలమైన కథలను చెబుతూ ఉంటారు. 'పలాస'ను మించి 'శ్రీదేవి సోడా సెంటర్' ఉంటుంది. సినిమా చూసిన తరువాత మీరు కూడా ఇదేమాట చెబుతారు. ఆనంది నటన కూడా మీకు బాగా నచ్చుతుంది. తనని తప్పకుండా మీరు ఆదరిస్తారు. ఇక నా నిర్మాతల విషయానికొస్తే, కృష్ణగారు - మహేశ్ నా పక్కనుంటే నాకు ఎంత ధైర్యంగా ఉంటుందో, వీరు నా తోడుగా ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. త్వరలో వీరు మహేశ్ తోను సినిమా చేస్తారనే నమ్మకం నాకు ఉంది.
సుధీర్ బాబుకు ఒక కరెక్ట్ సినిమా పడితే నెక్స్ట్ లెవెల్ కి వెళతాడని ఒక సందర్భంలో మహేశ్ బాబు అన్నాడు. మహేశ్ చెప్పిన ఆ సినిమా ఇదేనని నేను నమ్ముతున్నాను. గోదావరి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అక్కడి భాషలో చెప్పాలంటే ఇది ఒక మంచి 'పులస'లాంటి సినిమా. అలాంటి ఈ మూవీని ఓటీటీలో చూస్తే ఆ ఫీల్ రాదు. ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలి .. ఈ సినిమాతో థియేటర్లలో మళ్లీ 'జాతర' మొదలుకావాలి. ఈ సినిమా ట్రైలర్ చూసి ఫలానా సినిమాలా అనిపిస్తుందని కొంతమంది అన్నారు. అలాంటివారికి నేను ఒకటే మాట చెబుతున్నాను. సుధీర్ గాడు రొటీన్ సినిమాలు చేయడు. దీనిని మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు థియేటర్లలో నుంచి వెళ్లేటప్పుడు కాలర్ ఎగరేసుకుంటూ వెళతారు" అని చెప్పుకొచ్చాడు.